లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ తన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం 'ఆర్మ్ చెయిర్ ఎక్స్ పర్ట్' పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. బాధలు, కట్టుబాట్లు నుంచి విముక్తి కోసమే రాజ కుటుంబం బంధాలను తెంచుకుని అమెరికాకు వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడే కాదు తన 20 ఏళ్ళ వయసులో అనేక సందర్భాల్లో ఆయన తన రాజ జీవితాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన చాలా సార్లు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
2020 ప్రారంభంలో రాజ కుటుంబం తనను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టినట్లు హ్యారీ తెలిపాడు. తన తల్లి వదిలివెళ్లిన డబ్బుతోనే ఆ సమయంలో ఎటువంటి ఆర్థిక సమస్య రాకుండా చూసుకున్నట్లు తెలిపారు. రాజ కుటుంబంలో అలవాట్లు, పద్ధతులు తనకి పెద్దగా నచ్చేవి కాదని ఒక్కోసారి అక్కడ వాళ్లతో జీవించడం జంతుప్రదర్శనశాలలో ఉన్నట్లు అనిపించేదని అన్నారు. తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించిన రోజులను గుర్తు చేసుకుని బాధని వ్యక్తం చేశాడు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్ తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్ కు సమీపంలోని మోంటేసిటోలో నివసిస్తున్నారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
( చదవండి: వైరల్: అతడిపై ‘థూ’ అని ఉమ్మింది.. యుద్ధం మొదలైంది! )
Comments
Please login to add a commentAdd a comment