
మే 19, 2018. ప్రపంచాన్ని ఆకర్షించే ఓ వేడుక జరగబోతోంది. అది ఏ అవార్డు వేడుకో, ఫుట్‌బాల్ వరల్డ్‌కప్పో, మరింకోటో కాదు. పెళ్లి. అంత స్పెషల్ ఎందుకంటే.. అది బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ పెళ్లి మరి! అంగరంగ వైభవంగా రాయల్ ఫ్యామిలీ రేంజ్‌కి తగ్గట్టుగా జరుగుతుంది ఈ పెళ్లి.
హ్యారీ.. మేఘన్ మార్కెల్‌ను కాకుండా ఇంకెవరినో చేసుకుంటే ఈ పేపర్లోకి ఎక్కేవాడు కాదేమో.! మేఘన్‌ను చేసుకుంటున్నాడు కాబట్టి వచ్చేశాడు. మేఘన్ హాలీవుడ్‌లో పాపులర్ స్టార్ కావడంతో ఇటు సినీ పరిశ్రమ, అటు రాజకీయ వర్గాలు ఈ పెళ్లికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పట్నుంచే మొదలైపోయాయి. ముఖ్యంగా రాయల్ ఫ్యామిలీకి కాబోయే కోడలు వేసుకునే వెడ్డింగ్ డ్రెస్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
కొన్ని నెలల పాటు శ్రమించి ఈ డ్రెస్‌ను డిజైన్ చేస్తారు డిజైనర్స్. డ్రెస్ అణువణువూ రాయల్ కళ ఉట్టిపడేలా చూసుకుంటారు. మేఘన్ కూడా ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటోంది. ఇప్పటికే ఓ డిజైనర్‌ను కూడా రిక్రూట్ చేసుకుంది. ఇంకెవరో ఎందుకు అని చెప్పి, తన ఫ్రెండ్ జెస్సికా మల్రోనిని డిజైనర్‌గా ఎంపిక చేసుకుంది మేఘన్. మేఘన్ కోసం టొరంటో నుంచి లండన్‌కు వెళ్లిపోయి జెస్సికా ఇప్పటికే డ్రెస్ డిజైన్ పనులు మొదలుపెట్టేసిందట. పెళ్లి తర్వాత మేఘన్ సినిమాలకు దూరం కావాలనుకోవడంతో ఆమె అభిమానులు ఈ పెళ్లినే ఓ సినిమాగా చూసుకుంటున్నారు. ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు!!
Comments
Please login to add a commentAdd a comment