హాలీవుడ్ నటితో యువరాజు వివాహం.. | Prince Harry wedding held in 2018, says father Prince Charles | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ నటితో యువరాజు వివాహం..

Published Mon, Nov 27 2017 4:50 PM | Last Updated on Mon, Nov 27 2017 7:06 PM

Prince Harry wedding held in 2018, says father Prince Charles - Sakshi - Sakshi

లండన్‌: అందరూ అనుకున్నదే జరిగింది. హాలీవుడ్ నటి, యువరాజుల ప్రేమ త్వరలో ఫలించనుంది. బ్రిటన్‌ యువరాజు హ్యారీ వివాహం వచ్చే ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రిన్స్ హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల నటి మేఘన్ మార్కెల్‌, తన కుమారుడు హ్యారీల నిశ్చితార్థం జరిపించామని చార్లెస్ పేర్కొన్నారు. నటి మార్కెల్ తల్లిదండ్రుల అంగీకారం తెలపడంతో పాటు హ్యారీని ఆశీర్వదించారని వివరించారు.

మేఘన్ మార్కెల్ (36), ప్రిన్స్ హ్యారీ(33)లు కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. బ్రిటన్ యువరాజు హ్యారీతో ప్రేమ వ్యవహారం నటి మేఘన్‌కు భలే పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతగా అంటే.. ఏకంగా మోస్ట్ సెర్చ్‌డ్‌ నటిగా 2016 ఏడాదికి గానూ మేఘన్ తన పేరు లిఖించుకుంది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్‌ తో డేటింగ్ చేస్తున్నట్లు హ్యారీ బహిరంగంగానే తెలిపాడు.   'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ' తమ ప్రేమ విషయాన్ని నటి మేఘన్ కూడా ఇటీవల పెదవి విప్పింది.

గతేడాది జూలై నెలలో 'సూట్స్‌' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అక్కడి నుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. నిర్మాణ ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో యువరాజు హ్యారీతో తన పరిచయాన్ని ప్రేమగా మలుచుకుని పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధంగా ఇటీవల ప్రచారమైన వదంతులు 2018లో వీరి వివాహంతో నిజం కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement