మేఘన్‌ను కౌగిలించుకుంటున్న ఎకర్
లండన్ : ఓ చిన్న కౌగిలితో ఆ కుర్రాడు సోషల్ మీడియా ఫేమస్ అయ్యాడు. అతడు కౌగిలించుకున్నది కూడా ఆశామాషీ వ్యక్తిని కాదులెండి! ఓ యువరాణిని. తను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూ ఆమెభర్తకు లేఖరాయటంతో ఆ కుర్రాడు మరింత పాపులర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఉమెన్స్‌డేను పురష్కరించుకుని గత శుక్రవారం లండన్‌లోని ఓ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడకుండా.. ‘ విద్యార్థుల్లోనుంచి ఎవరైనా వచ్చి ఇంటర్ నేషనల్ ఉమెన్స్ డే ప్రాధాన్యత గురించి మాట్లాడితే బాగుంటుంద’ని అన్నారు. కొద్దిసేపు ఎవరూ పైకి లేయలేదు. ఆ తర్వాత ఎకర్ ఒకోయి అనే విద్యార్థి ధైర్యంగా స్టేజిమీదకు వెళ్లాడు. మైక్ దగ్గరకు వెళ్లిన తర్వాత మేఘన్ మార్కెల్ ఎంతో అందంగా ఉందంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు.
మాట్లాడుతున్న ఎకర్, పక్కన మేఘన్ మార్కెల్
ఎకర్ మాట్లాడటం ముగించిన తర్వాత మేఘన్ ప్రొటోకాల్‌ను పక్కన పెట్టిమరీ అతడ్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ సంఘటనపై ఎకర్.. మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీకి ఆదివారం లేఖ రాశాడు.. ‘‘ డియర్ హ్యారీ అండ్ మేఘన్ మార్కెల్. హ్యారీ నేను మీ భార్యను కౌగిలించుకున్నందుకు మీరేమీ అనుకోరు కదా! దయచేసి నన్ను క్షమించండి. ఆమెను చూడగానే భావోద్వేగానికి లోనయ్యాను, ఒకింత షాకింగ్‌గానూ ఉండింది. ఆమె మాటలు వినటం.. ఆమె ముందు మాట్లాడటం నాకెంతో సంతోషాన్నిచ్చింద’ ని పేర్కొన్నాడు.
చదవండి : మార్చి 31 నుంచి వారు సామాన్యులు..
Comments
Please login to add a commentAdd a comment