
అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంక ట్రంప్
హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష తనయ, సలహాదారు ఇవాంక ట్రంప్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇందుకు కారణం త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీలకు ఆమె శుభాకాంక్షలు తెలపడమే. వచ్చే ఏడాది మే నెల 19వ తేదీన మార్కెల్, హ్యరీల వివాహా వేడుక సెయింట్ జార్జి చాపెల్ చర్చిలో పెళ్లి చేసుకోనున్నారు. గత నెలలో ఇరువురికి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
శుక్రవారం ఇవాంక ట్విట్టర్ వేదికగా దంపతులు కానున్న జంటకు శుభాకాంక్షలు చెప్పడంపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పెళ్లి పిలుపు కోసమే ఇవాంక శుభాకాంక్షలు చెప్పారంటూ పలువురు రీట్వీట్లు చేశారు. రాయల్ ఫ్యామిలీ.. ట్రంప్ క్రైమ్ ఫ్యామిలీని ఆహ్వానించబోదు అని వ్యాఖ్యానించారు.
1:2 Wishing Meghan and Prince Harry a lifetime of love, laughter and happiness together. https://t.co/fgjJhCfYnr https://t.co/8YP3Nzef5I
— Ivanka Trump (@IvankaTrump) 15 December 2017
2:2 I have no doubt that this couple will do extraordinary things, both individually and collectively. Congratulations!
— Ivanka Trump (@IvankaTrump) 15 December 2017
Comments
Please login to add a commentAdd a comment