
తల్లీకొడుకులు: చిన్నారి ప్రిన్స్ హ్యారీ, లేడీ డయానా , ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్
ప్రిన్స్ హ్యారీ ఒక బిడ్డకు తండ్రి అయ్యాక కూడా.. తన తల్లి డయానాతో పెనవేసుకుని ఉన్న తన చిన్ననాటి జ్ఞాపకాలను విడిచిపెట్టలేకపోతున్నారు. యు.ఎస్.లో గురువారం జరిగిన ‘ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు’లో ప్రసంగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయనకు తన తల్లి జ్ఞప్తికొచ్చారు. ‘‘నా జీవితంలోని పెద్ద విషాదం మా అమ్మ చనిపోవడం. ఆమె నన్నెంతగా ప్రేమించేవారో ఒక్కో సందర్భాన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటే మనసుకు తీరని ఆవేదన కలుగుతుంటుంది. నాటి దురదృష్టకర ఘటనన నుంచి బయటపడేందుకు గత ఏడేళ్లుగా నేను థెరపీలో ఉన్నాను’’ అని ప్రిన్స్ హ్యారీ గుండె లోతుల్లోంచి మాట్లాడారు.
కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత.. ‘‘రాజకుటుంబంలోంచి బయటికి వచ్చినందుకు మాకేమీ పశ్చాత్తాపాలు లేవు’’ అన్నారు. దీనర్థం.. అమ్మ తప్ప నాకక్కడ అయివారెవరూ లేరని చెప్పడమే! ఎన్ని చెప్పీ.. తల్లి స్మృతుల్లోంచి హ్యారీని బయటికి తెప్పించలేనని ఆయన భార్య మేఘన్ మార్కల్ అర్థం చేసుకున్నట్లున్నారు.. అందుకే ఆమె కూడా తరచూ భర్తకు తోడుగా డయానా స్మృతుల్లోకి వెళుతుంటారు. డయానా 1997లో పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. డయానా వ్యక్తిగత జీవిత సంచలనాలను ఫొటోలుగా తీసేందుకు ఆమె కారును వెంటాడుతున్న రహస్య మీడియా వాహనాలే ఆ ఘోర ప్రమాదానికి కారణం.
Comments
Please login to add a commentAdd a comment