Simon Rex Reveals He Was Offered Rs 50 Lakh To Claim He Slept with Meghan Markle - Sakshi
Sakshi News home page

Meghan Markle: మేఘన్‌తో పడుకున్నానని చెప్తే రూ.50 లక్షలిస్తామని ఆఫర్‌!

Published Sat, Mar 19 2022 10:59 PM | Last Updated on Sun, Mar 20 2022 10:11 AM

Simon Rex Reveals He Was Offered Rs 50 Lakh To Claim He Slept with Meghan Markle - Sakshi

ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి బ్రిటన్‌లోని ఓ వర్గం మీడియా దిగజారి ప్రవర్తించింది. ఆమెతో ఒక రాత్రంతా ఉన్నట్లు చెప్తే రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్‌ చేశారని తెలిపాడు.

Simon Rex: ప్రిన్స్‌ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్‌ రాచకుంటుంబంలో జాతి వివక్షను ఎదుర్కొంది నటి మేఘన్‌ మార్కెల్‌. వివాహం తరువాత రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయి. దీనికితోడు బ్రిటన్‌లోని ఓ వర్గం మీడియా కూడా ఈ జంటకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో మానసిక వేదనను భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మేఘన్‌. అయితే పెళ్లికి ముందు కూడా ఆమెను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ప్రిన్స్‌ హ్యారీని పెళ్లాడటానికి ముందు ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి బ్రిటన్‌లోని ఓ వర్గం మీడియా దిగజారి ప్రవర్తించిందని నటుడు సిమన్‌ రెక్స్‌ వెల్లడించాడు. ఆమెతో ఒక రాత్రంతా ఉన్నట్లు చెప్తే రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్‌ చేశారని తెలిపాడు. నిజానికి తనకు ఆ సమయంలో డబ్బులు చాలా అవసరం ఉన్నాయని, కానీ అందుకోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయలేనని సదరు ఆఫర్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు.

చదవండి:  The Kashmir Files: అప్పుడే వంద కోట్లు, అవాక్కవుతున్న బాలీవుడ్‌!

ఈ విషయం తెలుసుకున్న మేఘన్‌.. 'ఇంకా మంచి మనుషులు ఉన్నారని తెలిసినందుకు సంతోషంగా ఉంది' అంటూ అతడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ పంపిందట. దాన్ని ఫ్రేమ్‌ కట్టించుకుని ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నానని చెప్పాడు సిమన్‌. కాగా మేఘన్‌, సిమన్‌ 2005లో వచ్చిన కట్స్‌ బ్యాక్‌ సిరీస్‌లో ఒక్క ఎపిసోడ్‌లోనే కలిసి నటించారు. నటిగా విశేషాదరణ సంపాదించుకున్న మేఘన్‌ 2018లో ప్రిన్స్‌ హ్యారీని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత కుటుంబంతో విభేదాల కారణంగా ప్రిన్స్‌ హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే! వీరికి కొడుకు ఆర్చీ, కూతురు లిల్లీ డయానా సంతానం.

చదవండి: వ్యాపారవేత్తకు కారు అమ్మిన స్టార్‌ హీరోయిన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement