Suriyas Etharkkum Thunindhavan: Movie Going To Release On Theatre Feb 4 - Sakshi
Sakshi News home page

Suriya: సూర్య నెక్ట్స్‌ మూవీ ట్రైలర్‌ చూశారా?..ఈసారి బొమ్మ థియేటర్‌లోనే

Published Sat, Nov 20 2021 8:00 AM | Last Updated on Sat, Nov 20 2021 11:19 AM

Suriyas Etharkkum Thunindhavan Going To Release On Theatre - Sakshi

సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యాయని నిరాశ చెందిన ఆయన అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌. సూర్య హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఎదర్కుమ్‌ తునిందవన్‌’ (దేనికైనా తెగించేవాడు) చిత్రం థియేటర్స్‌లో రానుంది.

కళానిధి మారన్‌ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ప్రియాంకా అరుళ్‌ మోహనన్, వినయ్‌ రాయ్, సత్యరాజ్, శరణ్య, సూరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్‌ స్వరకర్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement