Suriya Soorarai Pottru And Jai Bhim Movie To Re-Release In Theatres For His Birthday - Sakshi
Sakshi News home page

Suriya : సూర్య బర్త్‌డే స్పెషల్‌.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌

Published Mon, Jul 18 2022 4:28 PM | Last Updated on Mon, Jul 18 2022 5:57 PM

Suriya Soorari Pottru And Jai Bhum To Release In Theatres For His Birthday - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన నటించిన ఆ‍కాశం నీ హద్దురా, జై భీమ్‌ చిత్రాలు ఇప్పుడు అభిమానుల కోసం థియేటర్‌లో విడుదల కానున్నాయి. లాక్‌డౌన్‌ టైమ్‌లో డైరెక్ట్‌గా డిజిటల్‌ రిలీజ్‌ అయిన ఈ రెండు సినిమాలు ఎంతటి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆ‍కాశం నీ హద్దురా చిత్రం​ సూర్య కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది.

ఇక గతడాది సూర్య నటించి మరో చిత్రం ‘జై భీమ్’ సైతం ఓటీటీలో విడుదలైన దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా తమిళనాడులోని థియేటర్స్‌లో జులై 22 నుంచి రెండు రోజుల వరకు ప్రత్యేకంగా ఈ చిత్రాలు స్క్రీనింగ్‌ కానున్నాయి.దీంతో పాటు తమిళనాడు వ్యాప్తంగా సూర్య అభిమానులు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement