అమెరికాలోని కథా డ్యాన్స్ థియేటర్‌లో ప్రాచీన భారతీయ జానపద కథలను కథక్ డ్యాన్స్‌లో లయలుగా చేర్చి నృత్యకారులు అబ్బురపరుస్తున్నారు. కథక్ నృత్యం జానపద కథల జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కథా డ్యాన్స్ థియేటర్‌లో ‘పంచతంత్ర, ది డ్యాన్సింగ్ టేల్స్ ఆఫ్ విజ్డమ్‘ను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా విదేశాలలో భారత శాస్త్రీయ నృత్య రూపమైన కథక్ ద్వారా ప్రాచీన భారతీయ జానపద కథలకు జీవం పోస్తుంది.
‘ఈ థియేటర్ ప్రారంభంలో నా మనుగడే ప్రశ్నార్థకంగా ఉండేది. భారతదేశం నుండి వచ్చిన నేను నా సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం లేదు ఎప్పుడూ బాధగా అనిపించేది. మన పొరుగువారిని కలుసుకోవాలంటే కళలను మించిన మార్గం లేదు.
దీంతో 1987లో మా ఇంటి నేలమాళిగలో కథా థియేటర్ కంపెనీని ప్రారంభించాను’ అంటూ కథా డ్యాన్స్ థియేటర్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ రీటా ముస్తాఫీ తొలి రోజుల ప్రయత్నాలను వివరిస్తారు. ముస్తాఫీ, కథక్ క్లిష్టమైన ఫుట్‌వర్క్, హై–స్పీడ్ స్పిన్‌లు, రిథమిక్ ప్యాటర్న్‌లు, సాంస్కృతిక విభజనలను తగ్గించడానికి, కథలను చెప్పడానికి ఉపయోగిస్తూ వచ్చారు.
జంతు కథల ఆధారంగా!
ఇప్పుడు వారాంతాల్లో కథక్ నృత్య ప్రదర్శన ద్వారా నైతిక పాఠాలను బోధిస్తున్నారు. అందుకు, సంస్కృతంలో 2,000 ఏళ్ల క్రితం రాసిన జంతు కథల ఆధారంగా నృత్యాన్ని రూపొందించారు. ‘సింహం, నక్క, చిరుత, కాకి‘ కథలో మొదటిది... ఒక సింహం ఒంటెను వేటాడాలనే ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ దాని ప్రాణాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో నిజమైన నాయకత్వంలో దయ ఉంటుందని తెలుసుకుంటుంది. రెండవ కథ... ‘ది ఎలిఫెంట్ అండ్ ది మౌజ్‘లో, ఏనుగులు ఎలుకల సమూహాన్ని తొక్కడం మానుకుంటాయి. ఎలుకలు తరువాత ఏనుగులను వేటగాళ్ల ఉచ్చు నుండి రక్షిస్తాయి. శక్తి పరిమాణంతో సంబంధం లేకుండా పరస్పర గౌరవం విలువను ప్రదర్శిస్తాయి.
చివరి కథ... ‘ది ఫిష్ అండ్ ది ఫ్రాగ్‘లో, అతి విశ్వాసం ఉన్న చేపలను సమీపంలోని కుటుంబం గురించి కప్ప హెచ్చరిస్తే, అవి విస్మరిస్తాయి. ఫలితంగా వాటిని ఆ కుటుంబం పట్టుకోవడంలో జాగ్రత్త, అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ‘‘ఇవి నేను ఎదిగే సమయంలో విన్న కథలు. నా పిల్లలూ ఆ కథలను వింటూ పెరిగారు, ఇప్పుడు నా మనవరాళ్లు కూడా వాటిని చదువుతున్నారు. ఈ కథలు అర్థవంతమైనవి ఎందుకంటే అవి దయగా, తెలివిగా, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పుతాయి’ అని ముస్తాఫీ వివరిస్తారు.
ఒక చోట చేర్చే నృత్యం
సెయింట్ లూయిస్ పార్క్‌లోని థియేటర్ డ్యాన్స్ స్కూల్ నుండి కథా డ్యాన్స్ థియేటర్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన 42 మంది డ్యాన్సర్లు, అప్రెంటిస్‌లు, 8 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 20 మంది పిల్లలను ఈ నృత్యం ఒకచోట చేర్చుతుంది.
న్యూ ఢిల్లీకి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ మైత్రేయి పహారీ, 50కి పైగా దుస్తులు, 30 మాస్క్‌లను రూపొందించారు, కల్పిత కథల జంతు పాత్రలను డ్యాన్సర్‌లు ధరిస్తారు. ఈ ప్రదర్శనలో సంజుక్త మిత్రా పెయింటింగ్‌లు, మిన్నియాపాలిస్‌కు చెందిన నిర్మాత జె.డి. స్టీల్, భారతీయ స్వరకర్త జయంత బెనర్జీ స్వరపరిచిన ఒరిజినల్ స్కోర్, కల్పిత కథల ద్వారా ప్రేక్షకులకు మార్గనిర్దేశం చేసే ఆంగ్ల వాయిస్ ఓవర్, కథనం కూడా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment