కీవ్: గత మూడు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాలపై రష్యా పట్టు సాధించినా, అనేక ప్రాంతాల్లో ఇంకా ఉక్రెయిన్ దళాలు పోరాడుతునే ఉన్నాయి. ఫిబ్రవరి 24 నుంచి సుమారు 100 రోజులకుపైగా రష్యా దాడులను శక్తి మేరకు ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చర్యలను మరింత తీవ్రం చేసిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగామే నెలాఖరులో నేషనల్ ఒపెరా, సినిమాహాళ్లు తిరిగి తెరవడం ప్రారంభమైనాయి. అయితే పొండిల్‌లోని ఒక డ్రామా థియేటర్లో యుద్ధ వాతావరణంలోనే సాగిన తొలి ప్రదర్శన అద్భుతంగా నిలిచింది. రాజధాని కీవ్‌లో సాహసోపేతంగా థియేటర్ తెరుచుకోవడమే కాదు తొలిరోజు టికెట్లన్నీ అమ్ముడయ్యాయట.
యుద్ధ సమయంలో ప్రదర్శన ఇవ్వడానికి సంకోచించాం..కానీ కీవ్‌లో కాస్త ఆందోళన తగ్గిన తరువాత థియేటర్‌ను తెరవాలనుకున్నాం. యుద్ధం ఉందని మర్చి పోనప్పటికీ, జీవించడం కొనసాగించాలి. అయితే దీనికి నటీనటులు ఎలా సహాయపడతారనేది ప్రధాన ప్రశ్న అని నటుడు కోస్త్యా టామ్‌ల్యాక్ వ్యాఖ్యానించారు.
యుద్ధం సమయంలో ప్రేక్షకులు వస్తారా అని భయపడ్డాం. అసలు ఈ సంక్షోభ సమయంలో ప్రజలు థియేటర్ గురించి ఆలోచిస్తారా, వారికంత ఆసక్తి ఉంటుందా అనుకున్నాం. కానీ రానున్న మూడు నాటకాలకు టికెట్లు అమ్ముడుపోయాయి అంటూ నటుడు యూరి ఫెలిపెంకో సంతోషం వ్యక్తం చేశారు.
చారిత్రక థియేటర్
పొడిల్ నగరంలో డ్నీపర్ నది ఒడ్డున ఉంది ఈ చారిత్రక థియేటర్, ఇది కీవ్‌లో అత్యంత అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక ప్రాంతాలలో ఒకటి. 1987లో స్థాపించిన ఈ థియేటర్ కళాత్మక దర్శకుడు విటాలియ్ మలఖోవ్చే సారధ్యంలో నడుస్తోంది. ఉక్రెయిన్‌లోని ఆధునిక థియేటర్లకు ఇదే ఏకైక హబ్.
Comments
Please login to add a commentAdd a comment