tickets sold
-
TSRTC: న్యూ ఇయర్లో షాకిచ్చిన ఆర్టీసీ.. సిటీలో ప్రయాణికులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గట్టి షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీ కోసం టీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనికి మంచి స్పందన కూడా లభించింది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది. ఈ సందర్బంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023 ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’ అని తెలిపారు. -
ఉక్రెయిన్: యుద్ధం ఉన్నా జీవించాల్సిందే..వాళ్లలో కొత్త ఉత్సాహం
కీవ్: గత మూడు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాలపై రష్యా పట్టు సాధించినా, అనేక ప్రాంతాల్లో ఇంకా ఉక్రెయిన్ దళాలు పోరాడుతునే ఉన్నాయి. ఫిబ్రవరి 24 నుంచి సుమారు 100 రోజులకుపైగా రష్యా దాడులను శక్తి మేరకు ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చర్యలను మరింత తీవ్రం చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగామే నెలాఖరులో నేషనల్ ఒపెరా, సినిమాహాళ్లు తిరిగి తెరవడం ప్రారంభమైనాయి. అయితే పొండిల్లోని ఒక డ్రామా థియేటర్లో యుద్ధ వాతావరణంలోనే సాగిన తొలి ప్రదర్శన అద్భుతంగా నిలిచింది. రాజధాని కీవ్‌లో సాహసోపేతంగా థియేటర్ తెరుచుకోవడమే కాదు తొలిరోజు టికెట్లన్నీ అమ్ముడయ్యాయట. యుద్ధ సమయంలో ప్రదర్శన ఇవ్వడానికి సంకోచించాం..కానీ కీవ్‌లో కాస్త ఆందోళన తగ్గిన తరువాత థియేటర్‌ను తెరవాలనుకున్నాం. యుద్ధం ఉందని మర్చి పోనప్పటికీ, జీవించడం కొనసాగించాలి. అయితే దీనికి నటీనటులు ఎలా సహాయపడతారనేది ప్రధాన ప్రశ్న అని నటుడు కోస్త్యా టామ్ల్యాక్ వ్యాఖ్యానించారు. యుద్ధం సమయంలో ప్రేక్షకులు వస్తారా అని భయపడ్డాం. అసలు ఈ సంక్షోభ సమయంలో ప్రజలు థియేటర్ గురించి ఆలోచిస్తారా, వారికంత ఆసక్తి ఉంటుందా అనుకున్నాం. కానీ రానున్న మూడు నాటకాలకు టికెట్లు అమ్ముడుపోయాయి అంటూ నటుడు యూరి ఫెలిపెంకో సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Театр на Подолі (@theatre_on_podil) చారిత్రక థియేటర్ పొడిల్ నగరంలో డ్నీపర్ నది ఒడ్డున ఉంది ఈ చారిత్రక థియేటర్, ఇది కీవ్‌లో అత్యంత అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక ప్రాంతాలలో ఒకటి. 1987లో స్థాపించిన ఈ థియేటర్ కళాత్మక దర్శకుడు విటాలియ్ మలఖోవ్చే సారధ్యంలో నడుస్తోంది. ఉక్రెయిన్‌లోని ఆధునిక థియేటర్లకు ఇదే ఏకైక హబ్. -
ఒక్కో టికెట్.. 2 నుంచి 2.5 కోట్లు
చండీగఢ్: అవినీతి ఆరోపణల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సుచాసింగ్ చోటేపూర్ పార్టీ ఢిల్లీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ఢిల్లీ నేతలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కోట్లాది రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని బాంబు పేల్చారు. ఆప్ కేంద్ర నాయకత్వం పంజాబ్‌కు చెందిన ఏ నాయకుడినీ పార్టీలో ఎదగనీయడం లేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకుని ఆప్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. గురుదాస్‌పూర్ జిల్లా నుంచి పరివర్తన్ యాత్రను సుచాసింగ్ ప్రారంభించారు. ఢిల్లీ ఆప్ నేతల వల్ల తనకు, పంజాబ్ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు వివరిస్తానని చెప్పారు. పార్టీ కోసం పగలు, రాత్రి కష్టపడ్డానని, సొంత డబ్బు ఖర్చు చేశానన్నారు. పంజాబ్, ఎన్ఆర్ఐల నుంచి వసూలు చేసిన నిధుల గురించి తనకు ఏమాత్రం చెప్పలేదని, ఎన్ఆర్ఐలు ఇచ్చిన కోట్లాది రూపాయలను ఆప్ ఢిల్లీ నేతలు తీసుకెళ్లారని చెప్పారు. పంజాబ్‌లో పార్టీకి కోశాధికారిని కూడా నియమించలేదని తెలిపారు. పంజాబ్‌లో ఆప్‌కు బ్యాంక్ ఎకౌంట్ లేదని, నిధులన్నీ ఢిల్లీకి తీసుకెళ్లారని సుచాసింగ్ అన్నారు.