నగర మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం సాయంత్రం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.
హైదరాబాద్: నగర మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం సాయంత్రం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో కలియదిరిగిన ఆయన స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సరూర్‌నగర్, గడ్డి అన్నారం, చైతన్యపురి డివిజన్‌లోని పలుకాలనీల్లో కూడా ఆయన పర్యటించారు.
మురుగు కాల్వలు, డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడారు. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు.