సమావేశంలో కేటీఆర్, మేయర్
సాక్షి, హైదరాబాద్: ‘సరళంగా భవన నిర్మాణ అనుమతులు.. నిర్ణీత విస్తీర్ణం వరకు అసలు అనుమతులే అవసరం లేకపోవడం..వంటి కొత్త పురపాలక చట్టంలోని కీలకాంశాలన్నింటినీ పొందుపరచడంతోపాటు నగర అవసరాలకు తగిన విధంగా మరిన్ని సరళీకరణలతో జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మారుస్తాం.’ అని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్గదర్శనంలో అమల్లోకి వచి్చన కొత్త పురపాలకచట్టంలోని అన్ని కీలకాంశాలు జీహెచ్‌ఎంసీ చట్టంలోనూ ఉంటాయన్నారు. కొత్త జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మార్చిలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం కోసం పంపుతామన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరింత సదుపాయంగా, పారదర్శక పాలన అందించేందుకు జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మార్చనున్నట్లు తెలిపారు.
మునిసిపల్ చట్ట స్ఫూర్తిని, అందులోని నిబంధనలు యధాతథంగా జీహెచ్‌ఎంసీ చట్టంలోనూ ఉండాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరి్వంద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌లకు పలుఆదేశాలు జారీ చేశారు. సరళంగా భవన నిర్మాణ అనుమతులతోపాటు వేగవంతంగా పౌరసేవలు, అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ప్రజాప్రతినిధుల బాధ్యతల పెంపు వంటి కీలకాంశాలను చట్టంలో పొందుపర్చాలని సూచించారు.
ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సమూలంగా మార్చేందుకు, కొత్త పురపాలక చట్టంతో సమానంగా మార్పులకు అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా త్వరలో టీఎస్ బీపాస్ అమల్లోకి రానుండటంతో అలాంటి విధానం జీహెచ్‌ఎంసీ చట్టంలోనూ ఉండాలన్నారు. ఆమేరకు అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలోనూ భవననిర్మాణ అనుతుల్ని సరళీకరిస్తామని
పేర్కొన్నారు.
వేగంగా.. పారదర్శకంగా ఎన్నో సేవలు..
కొత్త చట్టం ద్వారా ప్రజలకు అనేక సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అమలవుతాయన్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. జోనల్ కమిషనర్లు మరింత చొరవతో వినూత్న ఆలోచనలతో సరికొత్త పథకాలను చేపట్టాలని ఆదేశించారు. ఎస్సార్‌డీపీ, ప్రైవేట్ ఏజెన్సీలతో రోడ్ల నిర్వహణ, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి పనులతోపాటు పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా టాయిలెట్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ది, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి ప్రాథమిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఇలాంటి వాటి కోసం ప్రత్యేక ఐటీ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా ఆయా కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పనుల జాప్యంపై ఆగ్రహం..
సీఆర్‌ఎంపీ పనులు కుంటుతుండటం. ఎస్సార్‌డీపీ పనుల్లో జాప్యంపై ప్రాజెక్టులు, టౌన్‌ప్లానింగ్ విభాగాలపై అసహనం వ్యక్తం చేశారు. స్లిప్, లింక్‌రోడ్ల పనులు ఏప్రిల్ 15లోగా పూర్తికావాలని ఆదేశించారు. ఒక ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ నోటీసులన్నీ ఒకేరోజు జారీ చేయాలని తద్వారా త్వరితంగా అవసరమైన చర్యలు తీసుకోవచ్చునన్నారు. సీఆర్‌ఎంపీ రోడ్లకు సంబంధించి జోనల్ కమిషనర్లు, ఇంజినీర్లు తగిన కార్యాచరణతో జాప్యానికి తావులేకుండా పనులు వేగిరం పూర్తిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
వివిధ పనులపై సమీక్ష..
జోన్‌కు నాలుగు మహాప్రస్థానాలు నిరి్మంచాలని, సీజనల్ వ్యాధుల నిరోధానికి క్యాలెండర్‌కనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని, పుట్‌పాత్‌లు, బస్òÙల్టర్లు, శ్మశానవాటికలు, హెచ్‌ఆర్‌డీసీఎల్ పనులు, పారిశుధ్యం, నాలాల డీసిలి్టంగ్, చెరువులపరిరక్షణ,సుందరీకరణ, వెండింగ్‌జోన్లు,ఇంకుడు గుంతలు, సీఅండ్‌డీ వేస్ట్ రీసైక్లింగ్,కొత్త డంపింగ్‌యార్డులు, చెత్త రవాణా వాహనాలు తదితర అంశాల గురించి తొలుత సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment