
బొంతు రాంమోహన్, శ్రీదేవి దంపతులు
కుషాయిగూడ: ‘ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రేమ చిగురించింది. 2001లో నేను ఉస్మానియా ఓయూ ఆర్ట్స్ కళాశాలలో పీజీ చేస్తున్న సమయంలో బొంతు రామ్మోహన్ ఏబీవీపీ నేతగా తెలుసు. ఎలాంటి పరిచయంలేదు. అప్పుడు ఆయన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నారు. మొదట్లో ఆర్ట్స్ కళాశాల వద్ద మా సీనియర్లు నన్ను ర్యాగింగ్ చేసినప్పుడు బాధపడిన నా సున్నిత మనస్తత్వం ఆయనకు చాలా నచ్చిందట. అప్పటి నుంచి నన్ను నిత్యం గమనిస్తుండేవారట. ఏడాది తర్వాత ఫ్రెషర్స్ డే సందర్భంగా తన మనసులో మాట చెప్పారు.
చదువు పూర్తికాగానే పెద్దలతో మాట్లాడి వివాహం చేసుకుంటానన్నారు. పెద్దలు మా పెళ్లికి నిరాకరించారు. తప్పని పరిస్థితుల్లో పెద్దలను ఎదిరించి 2004 ఫిబ్రవరి 7న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అనంతరం మార్చి12న అందరి సమక్షంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో శ్రాస్తోక్తంగా వివాహం చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమార్తెలు. బొంతు రామ్మోహన్ గ్రేటర్ మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహించిన చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాను’ అని తన స్వీట్ మెమొరీస్‌ను నెమరు వేసుకున్నారు బొంతు శ్రీదేవి.
చదవండి: ఐ లవ్యూ చెప్పకపోతే ఏం పోయింది!
Comments
Please login to add a commentAdd a comment