తిరుమల సాక్షిగా.. కేటీఆర్‌ సీఎం: మేయర్‌ | KTR Will Become Telangana Chief Minister Says Bontu Rammohan | Sakshi
Sakshi News home page

తిరుమల సాక్షిగా..కేటీఆర్‌ సీఎం : మేయర్‌

Published Tue, Feb 2 2021 10:21 AM | Last Updated on Tue, Feb 2 2021 3:24 PM

KTR Will Become Telangana Chief Minister Says Bontu Rammohan - Sakshi

సాక్షి, తిరుపతి :  తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం‌ వీఐపీ దర్శనంలో జార్ఖండ్ మంత్రి మిథిలేష్ కూమార్ ఠాకూర్, క్రికెటర్ శ్రీశాంత్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మదుసుదన్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మేయర్ బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు. భగవంతుని కృపతో సందర్భం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సమిష్టి నిర్ణయంతోనే కేటీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేసారు. బంగారు తెలంగాణ సాధనకు మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement