స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సన్నద్ధం అయింది.
హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సన్నద్ధం అయింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమం శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరగనుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్, కమిషనర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛతపై నగర పౌరుల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉందని,. స్వచ్ఛ హైదరాబాద్ కింద ఉత్తమ సేవలు అందించిన వారిని తగు రీతిలో సన్మానిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్
తెలిపారు.
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ మేయర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతను ఒకరోజు, ఒక వారానికే పరిమితం చేయొద్దని, నిరంతరం కొనసాగాలని అన్నారు. ఈసారి స్వచ్ఛభారత్ ర్యాంకుల్లో కేంద్రం 500 నగరాలను పరిగణనలోకి తీసుకోనుందని, స్వచ్ఛభారత్‌లో గతంలో హైదరాబాద్‌కు వచ్చిన ర్యాంకును నిలబెట్టుకోవాలని అన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్-2017 కింద 'వాహ్... హైదరాబాద్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి కేటీఆర్, పలువురు క్రీడా, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.