నేడు మేయర్గా బాధ్యతలు | rammohan to take charge tommorrow | Sakshi
Sakshi News home page

నేడు మేయర్గా బాధ్యతలు

Published Fri, Feb 12 2016 1:16 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM

నేడు మేయర్గా బాధ్యతలు - Sakshi

నేడు మేయర్గా బాధ్యతలు

హైదరాబాద్: హైదరాబాద్ గ్రేటర్ మేయర్గా బొంతు రామ్మోహన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. నేడు మధ్యాహ్నం 12.40గంటల ప్రాంతంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్గా రామ్మోహన్ను, డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండింటినీ కైవసం చేసుకుంది. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్‌ఎస్ 99 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement