సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఉధృతి ఎక్కువగా ఉంది. నగరంలో ఇప్పటికే పలువురు అధికారులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టుగా తేలింది.(వైరల్ వీడియో: శారద.. నీకు సెల్యూట్)
అయితే రామ్మోహన్ కుటుంబ సభ్యులకు మాత్రం కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో మేయర్ బొంతు రామ్మోహన్ హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతన్నారు. కాగా, కొద్ది రోజుల కిందట మేయర్ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చింది.(కరోనా : చేదు వార్త వినిపించిన టీ సర్కార్)
Comments
Please login to add a commentAdd a comment