నగరంలో మేయర్ బైక్ ర్యాలీ
Published Tue, May 16 2017 11:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నగరంలోని కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్‌లో అధికారులు, కార్పొరేటర్లతో కలిసి మేయర్ బొంతురామ్మోహన్ మంగళవారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీ ముకుందరెడ్డి, ఏఎంహెచ్‌వో భార్గవ్‌నారాయణ, కార్పోరేటర్లు లాస్యనందిత, పద్మానరేశ్‌లు పాల్గొన్నారు. రోడ్లపై నీటిని వదలొద్దని, గృహనిర్మాణాల వ్యర్థాలను వేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.
రోడ్లపై గుంతలు, వాటర్ లీకింగ్ పాయింట్లను సరిచేయాలని మేయర్ అధికారులకు ఆదేశించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీని పరిశీలించిన మేయర్ విదార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం అదనంగా రీడింగ్ షెడ్లు, తాగునీటి కోసం ఏటీడబ్ల్యూ, టాయ్‌లెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
Advertisement
Advertisement