
తొలగిన ఫ్లెక్సీలు
ముషీరాబాద్ కోడ్ కూసినా పట్టదాయే పేరుతో సాక్షి దిన పత్రికలో ప్రచురించిన కథనానికి జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. జీహెచ్‌ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ సాయికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది ముషీరాబాద్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ నేమ్‌బోర్డులపై ఉన్న మంత్రుల ఫొటోలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.
ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నివాసం వద్ద గల నిలువెత్తు ఫెక్సీలను సిబ్బంది పూర్తిగా తొలగించారు.