లండన్ : అంతర్జాతీయ సమాజం ముందు నిస్సిగ్గుగా పాకిస్తాన్ తన ద్వంద్వ విధానాలను మరోసారి ప్రకటించుకుంది. ఆర్థిక అవసరాల కోసం, ఎంతటి నీచానికైనా దిగజారేందుకు సిద్ధమని నిరూపించుకుంది. ఆక్రమిత కశ్మీర్‌కు నిధులు సమకూర్చే క్రమంలో లండన్‌లో ముజ్రా పార్టీని పాకిస్తాన్ ఆర్మీ పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆక్రమిత్ కశ్మీర్ అధ్యక్షుడు సర్దార్ మసూద్ ఖాన్ హాజరుకావడం, పార్టీని ఆస్వాదిస్తున్నట్లు వీడియోల్లో స్పష్టంగా తేలడంతో పెనువివాదం చెలరేగింది.
ముజ్రాపార్టీలో మహిళలు అభ్యంతరకర రీతిలో చేస్తున్న నృత్యాలకు ఇతర అతిథులతో పాటు మసూద్ ఖాన్‌కూడా ఆనందంగా ఆస్వాదించారు. ఆక్రమిత కశ్మీర్‌లో విద్యాభివృద్ధికై నిధుల తోడ్పాటు కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ దౌత్యవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో గతంలో చేసిన ప్రయత్నాలన్నీ అభాసుపాలయ్యాయి. అయినప్పటికీ పాకిస్తాన్ ఉన్నతాధికారులకు బుద్ధి రాలేదని పలువురు పాకిస్తాన్ పౌరులు ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ను నిలువరించేందుకు ప్రయత్నించే మసూద్ ఖాన్.. ముజ్రా డ్యాన్సర్లను ఆపకపోవడం విచారకరమని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. ఆక్రమిత కశ్మీర్ కోసం నిధుల సేకరణ అంటూ జరిపిన ఈ ముజ్రా డ్యాన్స్ ప్రోగ్రాం.. పాకిస్తాన్‌ను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిందని మీడియా చెబుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. పాకిస్తాన్ అతిథులు పాల్గొన్న ఈ ముజ్రా పార్టీలో.. భారతీయ యువతులు నృత్యాలు చేయడం.. వారితో అక్కడి పెద్దలు పాదం కలడం మొత్తం పాకిస్తాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిందని అక్కడి మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
#Pakistan stoops to a new low. Prime Minister of Pakistan occupied Kashmir holds erotic 'Mujra' in London to express solidarity with Kashmiris.Pak agents are collecting huge money in the name of Kashmiris every where.Big shame pic.twitter.com/7xJ9rifMM0
— Rajesh Raina راجیش (@rainarajesh) November 21, 2017
Comments
Please login to add a commentAdd a comment