‘ముజ్రా’ కేసులో మరో ఇద్దరికి రిమాండు | two members rimand in the mujra case | Sakshi

‘ముజ్రా’ కేసులో మరో ఇద్దరికి రిమాండు

Published Sat, Dec 13 2014 12:22 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

‘ముజ్రా’ కేసులో మరో ఇద్దరికి రిమాండు - Sakshi

‘ముజ్రా’ కేసులో మరో ఇద్దరికి రిమాండు

మొయినాబాద్: ముజ్రా పార్టీ కేసులో మరో ఇద్దరి నిందితులను మొయినాబాద్ పోలీసులు అరెస్టు  చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న గ్రీన్‌హోమ్ వెంచర్‌లోని ఓ ఇంట్లో ఈ నెల 8న సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీ నిర్వహిస్తూ 30 మంది యువతీయువకులు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇంటి యజమానితో పాటు ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఐ రవిచంద్ర వివరాలు వెల్లడించారు. చిలుకూరులోని గ్రీన్‌హోమ్ వెంచర్‌లో నగరంలోని మెహిదీపట్నంకు చెందిన విజయానందారె డ్డి 2006లో ప్లాట్ కొనుగోలు చేసి ఇళ్లు ని ర్మించుకున్నాడు.

ఆరు నెలల క్రితం ఇంటిని అద్దెకు ఇస్తామంటూ ‘ఆన్‌లైన్’ ప్రకటన పెట్టాడు. నగరంలోని కొత్తపేటలో నివాసముండే ప్రదీప్‌జైన్ అమీర్‌పేటలో టెలికాలర్‌గా పనిచేస్తూ సుల్తాన్‌బజార్‌లో చాట్‌బండార్ నడుపుతున్నాడు. అతడికి  రూ. 4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. నిత్యం చాట్‌బండార్ వద్దకు వచ్చే దిలీప్‌జైన్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. తనకు రూ.4 లక్షల అప్పు ఉందని ప్రదీప్‌జైన్, దిలీప్‌జైన్‌కు చెప్పాడు. ఓ ఇంటినిగాని, ఫాంహౌస్‌ను గాని అద్దెకు తీసుకుంటే అందులో పార్టీలు ఏర్పాటు చేస్తూ డబ్బు సంపాదించవచ్చని దిలీప్‌జైన్ అతడికి సల హా ఇచ్చాడు.

‘నీవు ఇంటినిగాని, ఫాంహౌస్‌ను గాని అద్దెకు తీసుకుంటే పార్టీలు ఏర్పాటు చేసే విషయం నేను చూసుకుంటాన’ని ప్రదీప్‌జైన్ చెప్పాడు. దీంతో 6 నెలల క్రితం ప్రదీప్‌జైన్ ఆన్‌లైన్‌లో ప్రకటన చూసి చిలుకూరులోని విజయానందారెడ్డి ఇంటిని నెలకు రూ.30 వేల చొప్పున అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి పార్టీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి  దిలీప్‌జైన్ ఏర్పాటు చేసిన ముజ్రా పార్టీపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. దిలీప్‌జైన్‌తో పాటు 30 మందియువతీ యువకులకు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇంటి యజమాని విజయానందారెడ్డి, ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రదీప్‌జైన్‌లను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement