![Man Set Fire To Friend Home In Nellore - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/2/love.jpg.webp?itok=0tPw_xM_)
సాక్షి, నెల్లూరు : జిల్లాలో ఓ ప్రేమోన్మాది అరాచకానికి పాల్పడ్డాడు. మందలించారన్న కోపంతో యువతి స్నేహితురాలి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి... ప్రేమోన్మాదిని అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలోని ఇంటర్ చదువుతున్న విద్యార్థి వంశీ తన సహచర విద్యార్థిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన స్నేహితురాలికి చెప్పింది. వంశీ కుటుంబంతో యువతి స్నేహితురాలి కుటుంబానికి పరిచయం ఉండటంతో ఆమె అమ్మమ్మ కమలకుమారి.. వంశీని మందలించారు. దీంతో ఆగ్రహించిన వంశీ.. వారం క్రితం కమలకుమారి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. మేడ మీద వున్న కమలకుమారి కుటుంబసభ్యులు.. దీన్ని షార్ట్ సర్క్యూట్‌గా భావించారు. కానీ నిన్న సీసీటీవీ ఫుటేజ్ చూడటంతో వంశీ పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వంశీని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment