కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులోని ప్రధాని నిందితుడు సంజయ్‌రాయ్‌తో పాటు మరో ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో పాలిగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సంజయ్ రాయ్ సమ్మతించడంతో ఆయనతోపాటు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఓ పౌర వాలంటీర్‌కు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. కానీ పాలిగ్రాఫ్ పరీక్షకు సీబీఐ ఇంకా తేదీని ఇంకా నిర్ణయించలేదు.
అయితే పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతించారని సంజయ్‌రాయ్‌ను సీబీఐ కోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. దీనికి అతను సమాధానం చెబుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాను నిర్దోషినని చెప్పాడు. తనెలాంటి తప్పు చేయలేదని. కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. .ఈ పాలిగ్రాఫ్ పరీక్షతో ఆ విషయం బయటపడుతుందని ఆశిస్తున్నానని కోర్టుకు తెలిపాడు. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది.
అయితే ఇప్పటి వరకు పోలీసులు విచారణలో సీబీఐ దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు సంజయ్ రాయ్.. ఇప్పుడు న్యాయస్థానంలో యూటర్న్ తీసుకొని, తాను ఏ నేరం చేయలేదని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. సైకో అనాలసిస్‌లోనూ సంజయ్ రాయ్ చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించినట్లు వెల్లడైన సంగతి విదితమే.
మరోవైపు కోల్‌కతాలో వైద్యుల ఆందోళనలు విరమించాలని బెంగాల్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రోగుల సంరక్షణకు ఆటంకం కలుగుతోందని, ఆందోళనలో ఉన్న జూనియర్ వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.
"మెడికల్ కాలేజీలలో వైద్య సేవలకు రెసిడెంట్ వైద్యులు వెన్నెముక. వారు లేకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తృతీయ, మాధ్యమిక ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి రమ్మని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ నారాయణ్ స్వరూప్ నిగమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment