అనకాపల్లి జిల్లా: అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులుగా నిందితుడు కోసం 12 బృందాలు గాలిస్తున్నారు. రాంబిల్లి మండలం కొప్పు గుండుపాలెంలో సురేష్ మృతదేహాం దొరికింది.
కాగా, నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాంబిల్లి మండలంలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ పాత, ప్రస్తుత ఫొటోలు విడుదల చేశారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు హత్యకు ముందు.. తరువాత నిందితుడు బట్టలు మార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విశాఖపట్నం జైలులో ఉన్న సమయంలో ఎవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలోనూ పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment