
బొమ్మ–బొరుసు ఆటలో వివాదం కర్నూలులో ఘటన
కర్నూలు (టౌన్): ఇద్దరూ కల్లు తాగారు. బొమ్మ–బొరుసు ఆడారు. రూ.వంద పోగొట్టుకున్న వ్యక్తి.. గెల్చిన యువకుడి తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ విషాద సంఘటన కర్నూలులో సోమవారం జరిగింది. స్థానిక మమతానగర్‌కు చెందిన కృపానందం అలియాస్ ఆనంద్ (27) వృత్తిరీత్యా గౌండా (తాపీ) పని చేస్తున్నాడు. తల్లి, నలుగురు సోదరులు ఉన్న అతడు రోజూ కల్లు తాగేవాడు.
స్థానిక రోజావీధికి చెందిన అజీజ్ అతడికి పరిచయమయ్యాడు. సోమవారం ఇద్దరూ కల్లు తాగిన తర్వాత సంకల్‌బాగ్‌లోని ఓ స్కూల్ వద్ద బొమ్మ–బొరుసు ఆట ఆడారు. ఈ ఆటలో కృపానందం రూ.100 గెల్చున్నాడు. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. తన డబ్బులు ఇచ్చేయాలంటూ అజీజ్ రాయితో కృపానందం తలపై కొట్టాడు. దీంతో కృపానందం అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment