బంగ్లాదేశ్‌లో అధికార షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కోల్‌కతాలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. చికిత్స కోసం మే12న అనర్ భారత్‌కుచ్చిన ఆయన పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో తన స్నేహితులు గోపాల్ బిస్వాస్‌తో కలిసి ఉంటున్నారు. అనంతరంఅనర్ కనిపించకుండా పోయిన మే 14న.. దారుణ హత్యకు గురయ్యారు. న్యూటౌన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుర్తుపట్టని స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు.
కాగా 56 ఏళ్ల అజీమ్‌ను హంతకులు ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం వ్యక్తిని గుర్తుపట్టకుండా చేసేందుకు మాంసం, ఎముకలు, చర్మాన్ని వేరుచేసి శరీరాన్ని ముక్కలుగా చేశారు. శరీర భాగాలన్నింటిని ప్లాస్టిక్ సంచుల్లో వేర్వేరుగా ప్యాకింగ్‌చేసి ఫ్లాట్‌లోని ఫ్రిజ్‌లో భద్రపరిచినట్లు తేలింది. తర్వాత కోల్‌కతా అంతటా పడేసిననట్లు పోలీసులు గుర్తించారు. అయితే ముక్కలు చేసిన భాగాలను ఎక్కడెక్కడ పడేశారన్న విషయం తెలియరాలేదు.
ఈ కేసును పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు, బంగ్లాదేశ్‌లోని ఢాకా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఎంపీని ఆయన పాత స్నేహితుడే రూ. 5 కోట్లు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బంగ్లాదేష్‌లో ఉంటున్న అమెరికా పౌరసత్వం ఉన్న జీహాద్ హవ్లాదార్.. మరికొందరు కలిసి ఎంపీని అంతమొందించినట్లు తేలింది. కోల్‌కతా శివారులోని న్యూ టౌన్ ప్రాంతంలో అజీమ్ చివరిసారిగా కనిపించిన అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను ఆయన స్నేహితుడే అద్దెకు తీసుకున్నాడు. జీహాద్ హవ్లాదా్‌ర్‌ను శుక్రవారం ఉదయం కల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు అన్వర్‌ను చంపడానికి గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హంతకుల్లో ఒకరితో పరిచయం ఉన్న శిలాస్తి రెహమాన్‌ను ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెనే బంగ్లాదేష్ ఎంపీని హానీ-ట్రాప్ చేసి హత్య చేసేందుకు హంతకులకుసహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పోలీసుల విచారణలో ఎంపీ హనీ ట్రాప్‌లో పడినట్లు తేలింది. అతడిని మహిళ ప్రలోభపెట్టి ఫ్లాట్‌లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడికి వెళ్లిన వెంటనే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో మహిళతో అనర్ ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు కనిపించింది.
ఇక హంతకుల్లో ఒకరైన యూఎస్ పౌరుడు అఖ్తరుజ్జమాన్‌కు, శిలాస్తి రెహమాన్‌కు పరిచయం ఉన్నట్లు తేలింది. ఇతడే ఎంపీని చంపేదుకు నిందితులకు రూ. 5 కోట్లు చెల్లించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఖ్తరుజ్జమాన్ పరారిలో ఉన్నారు. అతడు అమెరికాలో ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment