memeber of parliament
-
హానీట్రాప్‌లో బంగ్లాదేశ్ ఎంపీ.. హత్యకు రూ.5 కోట్ల సుపారీ
బంగ్లాదేశ్‌లో అధికార షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కోల్‌కతాలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. చికిత్స కోసం మే12న అనర్ భారత్కుచ్చిన ఆయన పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో తన స్నేహితులు గోపాల్ బిస్వాస్‌తో కలిసి ఉంటున్నారు. అనంతరంఅనర్ కనిపించకుండా పోయిన మే 14న.. దారుణ హత్యకు గురయ్యారు. న్యూటౌన్‌లోని ఓ అపార్ట్మెంట్లో గుర్తుపట్టని స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు.కాగా 56 ఏళ్ల అజీమ్‌ను హంతకులు ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం వ్యక్తిని గుర్తుపట్టకుండా చేసేందుకు మాంసం, ఎముకలు, చర్మాన్ని వేరుచేసి శరీరాన్ని ముక్కలుగా చేశారు. శరీర భాగాలన్నింటిని ప్లాస్టిక్ సంచుల్లో వేర్వేరుగా ప్యాకింగ్‌చేసి ఫ్లాట్‌లోని ఫ్రిజ్‌లో భద్రపరిచినట్లు తేలింది. తర్వాత కోల్‌కతా అంతటా పడేసిననట్లు పోలీసులు గుర్తించారు. అయితే ముక్కలు చేసిన భాగాలను ఎక్కడెక్కడ పడేశారన్న విషయం తెలియరాలేదు.ఈ కేసును పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు, బంగ్లాదేశ్‌లోని ఢాకా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఎంపీని ఆయన పాత స్నేహితుడే రూ. 5 కోట్లు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బంగ్లాదేష్‌లో ఉంటున్న అమెరికా పౌరసత్వం ఉన్న జీహాద్ హవ్లాదార్.. మరికొందరు కలిసి ఎంపీని అంతమొందించినట్లు తేలింది. కోల్‌కతా శివారులోని న్యూ టౌన్ ప్రాంతంలో అజీమ్ చివరిసారిగా కనిపించిన అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను ఆయన స్నేహితుడే అద్దెకు తీసుకున్నాడు. జీహాద్ హవ్లాదా్ర్ను శుక్రవారం ఉదయం కల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు అన్వర్‌ను చంపడానికి గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హంతకుల్లో ఒకరితో పరిచయం ఉన్న శిలాస్తి రెహమాన్‌ను ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెనే బంగ్లాదేష్ ఎంపీని హానీ-ట్రాప్ చేసి హత్య చేసేందుకు హంతకులకుసహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణలో ఎంపీ హనీ ట్రాప్‌లో పడినట్లు తేలింది. అతడిని మహిళ ప్రలోభపెట్టి ఫ్లాట్‌లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడికి వెళ్లిన వెంటనే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజీలో మహిళతో అనర్ ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు కనిపించింది.ఇక హంతకుల్లో ఒకరైన యూఎస్ పౌరుడు అఖ్తరుజ్జమాన్‌కు, శిలాస్తి రెహమాన్‌కు పరిచయం ఉన్నట్లు తేలింది. ఇతడే ఎంపీని చంపేదుకు నిందితులకు రూ. 5 కోట్లు చెల్లించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఖ్తరుజ్జమాన్ పరారిలో ఉన్నారు. అతడు అమెరికాలో ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. -
లోక్‌సభ టు అసెంబ్లీ బాట..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకుగాను 88 చోట్ల విజయదుందుభి మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్లు పలువురు తాజా, మాజీ లోక్‌సభ సభ్యులను అసెంబ్లీ బరిలోకి దింపాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినవారు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారనే నమ్మకం ఒకవైపూ.. సదరు ఎంపీల అంగబలం, అర్ధబలం ఉపయోగించి మరికొందరి ఎమ్మెల్యేలను సైతం గెలుపించుకోవచ్చనే వ్యూహం మరోవైపు ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. అయితే, ప్రజామోదం పొందిన ఎంపీలు గెలుపొందగా.. మరికొందరికి పరాజయం తప్పలేదు. పోటీచేసిన ఎంపీలు.. బాల్కసుమన్ (టీఆర్ఎస్-చెన్నూర్)-గెలుపు, చామకూర మల్లారెడ్డి (టీఆర్ఎస్-మేడ్చల్)-గెలుపు. పోటీచేసిన మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్-కరీంనగర్)-ఓటమి, సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్-సికింద్రాబాద్ కంటోన్మెంట్)-ఓటమి, నాగం జనార్థన్‌రెడ్డి (కాంగ్రెస్-నాగర్‌కర్నూలు)-ఓటమి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్ మునుగోడు)-గెలుపు, సురేష్ షెట్కార్ (కాంగ్రెస్-నారాయణఖేడ్)-ఓటమి, నామా నాగేశ్వర్ రావు (టీడీపీ-ఖమ్మం)-ఓటమి, మల్లు రవి (కాంగ్రెస్-జడ్చర్ల)-ఓటమి, పోరిక బలరాం నాయక్ (కాంగ్రెస్-మహబూబాబాద్)-ఓటమి, రమేష్ రాథోడ్ (కాంగ్రెస్-ఖానాపూర్)-ఓటమి,. -
వరద నష్టంపై వెంటనే సర్వే చేపట్టాలి
ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆస్తులు కోల్పోయిన, పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ అహ్మద్‌బాబును కోరారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కలెక్టర్‌ను కలిసిన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, అధికారులు యుద్ధప్రాతిపదికన సర్వేలు చేపట్టేలా చూడాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గతంలో కురిసిన భారీ వర్షాలతో ఆస్తులు, పంట నష్టపోయిన వారికి అన్యాయం జరిగిందని, అధికారులు తప్పుడు సర్వేలు చేపట్టి అధికార పార్టీ కార్యకర్తైలకే లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఈసారి మాత్రం అలాంటివి చోటుచేసుకోకుండా చూడాలని అన్నారు. పంట నష్టపోరుున రైతన్నకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యూనుస్ అక్బాని, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బలిరాం జాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనక తుకారాం, జిల్లా ఉపాధ్యక్షుడు గోక గణేశ్‌రెడ్డి ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తా జైనథ్ : పెన్‌గంగ వరద ఉధృతితో, భారీ వర్షంతో నీట మునిగిన పంటలను గురించి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి రైతులందరికీ పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఎంపీ రాథోడ్ రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండలంలోని ఖాప్రి గ్రామంలో నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అంతా నష్టపోయూమని, అప్పుల ఊబిలో చిక్కుకున్నామని రైతులు ఎంపీ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్, మండల అధ్యక్షుడు బాలాపూర్ విఠ్ఠల్ ఉన్నారు.