ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆస్తులు కోల్పోయిన, పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ అహ్మద్‌బాబును కోరారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కలెక్టర్‌ను కలిసిన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, అధికారులు యుద్ధప్రాతిపదికన సర్వేలు చేపట్టేలా చూడాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గతంలో కురిసిన భారీ వర్షాలతో ఆస్తులు, పంట నష్టపోయిన వారికి అన్యాయం జరిగిందని, అధికారులు తప్పుడు సర్వేలు చేపట్టి అధికార పార్టీ కార్యకర్తైలకే లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఈసారి మాత్రం అలాంటివి చోటుచేసుకోకుండా చూడాలని అన్నారు. పంట నష్టపోరుున రైతన్నకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యూనుస్ అక్బాని, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బలిరాం జాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనక తుకారాం, జిల్లా ఉపాధ్యక్షుడు గోక గణేశ్‌రెడ్డి ఉన్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తా
జైనథ్ : పెన్‌గంగ వరద ఉధృతితో, భారీ వర్షంతో నీట మునిగిన పంటలను గురించి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి రైతులందరికీ పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఎంపీ రాథోడ్ రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండలంలోని ఖాప్రి గ్రామంలో నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అంతా నష్టపోయూమని, అప్పుల ఊబిలో చిక్కుకున్నామని రైతులు ఎంపీ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్, మండల అధ్యక్షుడు బాలాపూర్ విఠ్ఠల్ ఉన్నారు.
వరద నష్టంపై వెంటనే సర్వే చేపట్టాలి
Published Mon, Aug 5 2013 4:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement