బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకుగాను 88 చోట్ల విజయదుందుభి మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పలువురు తాజా, మాజీ లోక్‌సభ సభ్యులను అసెంబ్లీ బరిలోకి దింపాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినవారు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారనే నమ్మకం ఒకవైపూ.. సదరు ఎంపీల అంగబలం, అర్ధబలం ఉపయోగించి మరికొందరి ఎమ్మెల్యేలను సైతం గెలుపించుకోవచ్చనే వ్యూహం మరోవైపు ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. అయితే, ప్రజామోదం పొందిన ఎంపీలు గెలుపొందగా.. మరికొందరికి పరాజయం తప్పలేదు.
పోటీచేసిన ఎంపీలు..
బాల్కసుమన్ (టీఆర్‌ఎస్-చెన్నూర్)-గెలుపు, చామకూర మల్లారెడ్డి (టీఆర్‌ఎస్-మేడ్చల్)-గెలుపు.
పోటీచేసిన మాజీ ఎంపీలు
పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్-కరీంనగర్)-ఓటమి, సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్-సికింద్రాబాద్ కంటోన్మెంట్)-ఓటమి, నాగం జనార్థన్‌రెడ్డి (కాంగ్రెస్-నాగర్‌కర్నూలు)-ఓటమి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్ మునుగోడు)-గెలుపు, సురేష్ షెట్కార్ (కాంగ్రెస్-నారాయణఖేడ్)-ఓటమి, నామా నాగేశ్వర్ రావు (టీడీపీ-ఖమ్మం)-ఓటమి, మల్లు రవి (కాంగ్రెస్-జడ్చర్ల)-ఓటమి, పోరిక బలరాం నాయక్ (కాంగ్రెస్-మహబూబాబాద్)-ఓటమి, రమేష్ రాథోడ్ (కాంగ్రెస్-ఖానాపూర్)-ఓటమి,.
Comments
Please login to add a commentAdd a comment