కోల్‌కతా హత్యాచారం కోల్‌కతా ప్రభుత్వ వైద్య విద్యాసంస్థ ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆవరణలో అత్యాచారం, ఆపై హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. కామాంధుల కర్కశత్వానికి ఓ యువ వైద్యురాలు బలైంది. సమాజం తలదించుకోవాల్సిన ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బెంగాల్‌లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.
తాజాగా వైద్యురాలి కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ నేడు(శుక్రవారం) ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదివారం లోగా దోషులకు ఉరిశిక్ష విధించాలని ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐఈ)కి అల్టిమేటం ఇచ్చారు.
అయితే పోలీసులు కేసును తప్పుదారి పట్టించారని, అధికార టీఎంసీ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం మమతా ర్యాలీకి పిలుపునివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా రాష్ట్రంలో పోలీసు, హోంశాఖ పోర్ట్‌ఫోలియోలను మమతానే నిర్వర్తిస్తున్నారు.-
అయితే పార్టీ అధినేత, సీఎం దీదీ ఎందుకు ర్యాలీతో వీధుల్లోకి వస్తున్నారనే విషయంపై టీఎంపీ ఎంపీ, అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రెయిన్ క్లారిటీ ఇచ్చారు. కోల్‌కతాలో జరిగిన వైద్యురాలితిపై జరిగిన అత్యాచారం, హత్య కంటే దారుణమైన ఘటనను ఊహించడలేం. దీనిపై ప్రజల ఆగ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆమె కుటుంబం కోసం అందరూ ప్రార్థించడండి అని పేర్కొన్నారు.
‘ఆర్‌జీ కర్ హాస్పిటల్ ఘటనపై మమతా బెనర్జీ ఎందుకు ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నారనేది సరైన ప్రశ్నే.. ఎందుకంటే ఇప్పుడు కేసును విచారిస్తున్న సీబీఐ, తమ దర్యాప్తుపై రోజువారీ అప్‌డేట్‌లు ఇవ్వాలి. అంతకముందు ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేయడానికి కోల్‌కతా పోలీసులకు సీఎం ఇచ్చిన గడువు ఆగస్టు 17. అదే సీబీఐకి కూడా వర్తించాలి.
ఇప్పటికే ఓ నిందితుడిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ మిగతా వారందరినీ అరెస్టు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపినప్పుడే న్యాయం జరుగుతుంది. దోషులను కఠినంగా శిక్షించినప్పుడుఏ బాధితులకు సత్వర న్యాయం జరుగుతుది. ఈ కేసులో ఎవరినీ విడిచిపెట్టకూడదు’ అని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment