టీడీపీ అగ్రవర్ణ సానుభూతిపరుడి దురాగతం
కూలి డబ్బు వద్ద వివాదమే హత్యకు కారణం!
పార్టీ అండతో ప్రమాదంగా చిత్రీకరణ.. స్టేషన్ బెయిల్
నాగులుప్పలపాడు: అగ్రవర్ణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు ఓ దళిత కూలీని ట్రాక్టర్ గొర్రుతో తొక్కించి హత్య చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రమాదంగా చిత్రీకరించి, స్టేషన్ బెయిలుపై వచ్చేసిన వైనం వెలుగు చూసింది. కూలి డబ్బు వద్ద తలెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకొని ఈ దురాగతానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కె.తక్కెళ్లపాడుకు చెందిన కొప్పుల రామయ్య (65) రైతుల వద్ద కూలి పనులు చేసుకొనేవాడు.
భార్య చనిపోవడంతో కుమార్తె వద్ద ఉంటున్నాడు. అదే గ్రామంలోని అగ్రవర్ణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కురుగుంట్ల రాఘవయ్య వద్ద కూడా కూలి పనిచేసేవాడు. కొద్ది రోజుల క్రితం కూలి విషయంలో రాఘవయ్యతో గొడవ జరిగింది. ఓ దళిత కూలీ నన్ను ప్రశి్నస్తాడా అని రాఘవయ్య కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం నుంచి తక్కెళ్లపాడుకు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న రామయ్యను రాఘవయ్య ట్రాక్టర్ గొర్రుతో తొక్కేశాడు.
ఎవరికీ అనుమానం రాకుండా తన ట్రాక్టర్‌ను పొలాల్లో దాచిపెట్టాడు. అనంతరం తీవ్ర గాయాలపాలైన రామయ్య వద్దకు అందరితో పాటు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్దాం పదండి అంటూ హడావుడి చేశాడు. రామయ్య ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. దాంతో అధికార పార్టీ అండతో ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయతి్నంచాడు. పోలీసుల విచారణలో రాఘవయ్య ట్రాక్టర్‌తో తొక్కించినట్లు తేలింది.
రాఘవయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా పొరపాటున ప్రమాదం జరిగినట్లు ఒప్పుకున్నాడు. అయితే, తన రాజకీయ పలుకుబడితో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించి, వెంటనే స్టేషన్ బెయిల్ తీసుకుని తన ట్రాక్టర్‌ను కూడా విడిపించుకున్నాడు.
15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల బాలికనూ ట్రాక్టర్‌తో తొక్కించి హత్య..
తన తండ్రిది ముమ్మాటికీ హత్యేనని రామయ్య కుమారుడు కొప్పుల కోటయ్య తెలిపాడు. ఇదే రాఘవయ్య అగ్రకుల అహంకారంతో 15 ఏళ్ల క్రితం తమ గ్రామానికే చెందిన 18 ఏళ్ల బాలికను కూడా ఇలాగే ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేసి ఎలాంటి కేసు లేకుండా మాఫీ చేసుకున్నాడని ఆరోపించాడు. రాఘవయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment