అక్రమార్కుల్లో వణుకు ఆమ్యామ్యాలపై నిఘా నేత్రం
నిన్న పింఛన్లు, నేడు సీఎం సహాయ నిధిపై ఆరా
పరకాల : సర్కారు కార్యాలయూల్లో అలజడి.. అవినీతి పరుల్లో ఆందోళన.. తమ నీడను తామే నమ్మలేని పరిస్థితి.. అవినీతి బాగోతాలు ఎప్పుడు బయటపడుతాయోనని కలవరం.. క్షేత్రస్థారుులో ఇటీవల నెలకొన్న పరిస్థితి ఇదీ. ప్రభుత్వ కార్యాలయాలపై కనిపించని నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల కదలికపై నిత్యం నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. లంచం అడిగే అధికారులు, అవినీతి బాగోతాలపై తనకు నేరుగా ఫిర్యాదు చేయూలని స్వయంగా సీఎం కేసీఆర్ టోల్‌ఫ్రీ నంబర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసరా పింఛన్ల అమలు పర్యవేక్షణ కోసం విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా సీఎం సహాయ నిధి లబ్ధిదారుల వివరాలు నిర్ధరించేందుకు సీఐడీ పోలీసులు రహస్యంగా ఆరా తీస్తున్నారు. ఇది ఉద్యోగుల్లో టెన్షన్ పెంచుతోంది.
మండలంలో జరిగిన ఆసరా పింఛన్ల గోల్‌మాల్‌లో విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గత నెల 21న ఎంపీడీవో కార్యాలయంలో విచారణ జరిపారు. ఇప్పుడున్న పింఛన్ లబ్ధిదారుల్లో 20శాతం మంది బోగస్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. విజిలెన్సు అధికారులు ఆసరా పింఛన్ల జాబితాను గ్రామాల వారీగా తీసుకున్నారు. ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు ముందు గుర్తించిన గ్రామాల్లోనే రహస్య విచారణకు సిద్ధపడుతున్నారు. నివేదిక ను సీఎంకు ఇస్తారు.
లంచగొండి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు 04023454071 టోల్ ఫ్రీ నంబర్‌కు ఇప్పటికే మండలం నుంచి చాలా మంది ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. నగర పంచాయతీలో కొందరు అధికారులు ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామంటూ లక్షల్లో వసూలు చేసిన వ్యవహారంపైనా ఫిర్యాదు చేసినట్లు చర్చ జరుగుతోంది. ప్రధాన రోడ్డు విస్తరణలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేసినట్లు కో ఆప్షన్ సభ్యుడు మేరుగు శ్రీశైలం తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై బాధితులు ఫోన్ చేసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఎక్కువ ఫోన్లు పరకాల నుంచే టోల్‌ఫ్రీకి చేరుతున్నాయని సమాచారం.
సీఎం సహాయ నిధి లబ్ధిదారుల వివరాలను సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. సీఐ జి. మోహన్ రెండు రోజుల క్రితం పట్టణంలోని డాక్టర్లును కలిసి వివరాలు తెలుసుకున్నారు. సీతారాంపురం గ్రామాన్ని సందర్శించారు. ఎవరి ద్వారా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు? దళారుల ప్రమేయం ఉందా? అనే విషయూలు ఆరా తీస్తున్నారు. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో సీఐడీ విస్తృతంగా విచారణ చేసింది.
{పభుత్వ కార్యాలయాల్లో ఇంటలిజెన్సు అధికారులు సామాన్య ప్రజల్లాగే ఆయా కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల తీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను అక్కడకు వచ్చే వారితో మాటలు కలిపి తెలుసుకుంటున్నట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలపై నిఘాల వర్గాల కన్ను ఉండగా ఇప్పుడు అధికారులపై అదే మంత్రాన్ని ఉపయోగిస్తుండడం గమనార్హం.
టెన్షన్.. టెన్షన్
Published Thu, Mar 5 2015 12:58 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM
Advertisement
Advertisement