గ్రేటర్‌లో న్యూ ఇయర్ పురస్కరించుకొని జరిగే ‘స్పెషల్ బిజినెస్’ పై వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
అమ్మకం పన్నుల చెల్లింపులపై ఆరా..
కార్పొరేట్ కొనుగోళ్లపై నిఘా...
సిటీబ్యూరో: గ్రేటర్‌లో న్యూ ఇయర్ పురస్కరించుకొని జరిగే ‘స్పెషల్ బిజినెస్’ పై వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ మహా నగ రం కేంద్రంగా ప్రతి యేట నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లు, గిఫ్ట్‌లు తదితర క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతాయి. ప్రతి యేట ప్రత్యేక వ్యాపారం టర్నోవర్ కనీసం రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఉంటుందన్నది అంచనా. కానీ వాణిజ్య పన్నుల శాఖకు అమ్మకం పన్ను వసూళ్లు తక్కువగా ఉండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. కార్పొరేట్ సంస్ధలు తమ బ్రాండ్ పేర్ల ముద్రణ లతో వ్యాపార సంస్థల వద్ద ముద్రించే, కొనుగోలు చేసే డైరీలు, క్యాలెండర్లు, టేబుల్ క్యాలెండర్లు తదితర గిఫ్ట్‌ల సమాచార సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం మీద న్యూ ఇయర్ బిజినెస్‌పై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. బిజినెస్ టర్నోవర్, వ్యాట్ ట్యాక్స్ చెల్లింపులపై అధికారులు దృష్టి సారించారు.
పన్ను ఎగవేతదారులు టార్గెట్‌గా...
మహా నగరంలో పన్ను ఎగవేతదారులుటార్గెట్‌గా వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టింది. కోట్లాది రూపాయల విలువగల వ్యాపారం ఎలాంటి పన్నులు చెల్లింపు లేకుండా సాగుతోంది. క్షేత్ర స్థాయి అధికారులకు తెలిసినా, మామూళ్ల ఒప్పందాలతో ఉన్నతస్థాయి వరకు సమచారం అందడం లేదన్నది బహిరంగ రహస్యమే. అదే సమయంలో వే బిల్లులు, సీ-ఫారాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానం ద్వారా అక్రమ రవాణా రాష్ట్ర సరిహద్దులు దాటిపోతోంది. ఎన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా పలుసరుకులు పన్నులు లేకుండా బాహాటంగా హైదరాబాద్‌కు దిగుమతి అవుతోంది. తక్కువ మొత్తంలో పన్ను చెల్లిస్తూ భారీ వ్యాపారాలు సాగిస్తున్న వారిపై సైతం దృష్టి సారించింది.
ఆన్‌లైన్‌పై...
నూతన ఇయర్ వ్యాపారం కూడా వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. తాజాగా ఆన్‌లైన్ బిజినెస్ కూడా బాగా పెరిగింది. ఆ వ్యాపారానికి సరైన లెక్కలు లేకుండా పోయాయి. ప్రస్తుతం సాగుతున్న వ్యాపారానికి, పన్నుల వసూళ్లకు పొంతన లేకుండా పోతోంది. దీంతో ఆన్‌లైన్ వ్యాపారం పై సైతం నిఘా పెట్టాలని నిర్ణయించారు.
జయభేరి క్లబ్‌లో ‘వీ’ పార్టీ
సిటీబ్యూరో: హైటెక్‌సిటీలోని హైటెక్స్ రోడ్ జయభేరి క్లబ్‌లో నూతన సంవత్స వేడుకలను ‘వీ-పార్టీ 16’ పేరిట గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అతి పెద్ద పూల్‌సైడ్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. డీజే మినాజ్ సంగీత హోరులో న్యూ ఈయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలనుకొనే వారికి జయభేరి స్వాగతం పలుకుతోంది. ఈ వేడుకల్లో అన్‌లిమిటెడ్ ఫుడ్, బివరేజెస్ అందజేస్తారు. డ్యాన్సులో పాల్గొనే జంటలకు ప్రత్యేక ఫ్లోర్ సిద్ధం చేశారు. అలాగే యాంకర్ గేమ్స్ నిర్విహ ంచి గెలిచిన వారికి బహుమతులను అందజేస్తారు. టాటూ,ఫేస్ పెయింటింగ్,ఫైర్ అండ్ బాటిల్ జగ్లర్,బాన్ ఫైర్ వంటి ఉత్తేజభరితమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనదలచిన వారు ఎంట్రీ పాస్‌ల కోసం ఫోన్ : 9248455551 నెంబర్‌కు సంప్రదించవచ్చు.
ఎన్‌వైఈ 2016
స్థలం: పెర్ల్ ప్యాలెస్,
ప్యామిలీ వరల్డ్, బేగంపేట
స్పెషల్: న్యూ ఇయర్ బాష్,
లైవ్ డీజే పెర్ ఫార్మెన్స్,
అన్‌లిమిటెడ్ పుడ్
నెంబర్స్: 7095341015, 9701111882
రియో కార్నివాల్- 2016
స్థలం: ఆదిత్యా పార్క్, అమీర్‌పేట
స్పెషల్: లైవ్ డీజే పెర్ ఫార్మెన్స్, అన్‌లిమిటెడ్ పుడ్,
నెంబర్స్: 7032711443, 9246577883, 7032711448
‘ఫుడ్ పార్కు’ రెడీ...
ఆటోనగర్: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న నిర్వహించే వేడుకలకు ఆటోనగర్‌లోని ఫుడ్‌ఫార్కు ఏసీ గార్డెన్ రెస్టారెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్నారులతో కలిసి కుటుంబ సభ్యులంతా వేడుకలు జరుపుకునేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. చిన్నారుల కోసం ఫ్రీ స్టాల్స్, కారికేచర్, పాట్ మేకింగ్, బెలూన్‌హౌస్, ట్రంపోలింగ్, టాటూస్, షుగర్‌క్యాండీ, అదే విధంగా మహిళల కోసం నెయిల్ ఆర్ట్, మెహిందీ, దాండియా, తంబోలా, బ్యాంగిల్ మేకింగ్, పురుషుల కోసం సోడా, డ్యాన్స్, మ్యూజిక్, తదితర ఏర్పాట్లు చేశామని చెప్పారు. దీంతో పాటు అన్ని రకాల వెజ్, నాన్‌వెజ్ వంటకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు వారు చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్-8885239239 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
జూ పార్కులో...
బహదూర్‌పురా: నూతన సంవత్సరం తొలిరోజు వేలాదిగా జూకు తరలివచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జూపార్కు క్యూరేటర్ గోపిరవి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు 10-12 టికెట్ కౌంటర్లను, అదనపు మంచినీటి సదుపాయం, సెక్యూరిటీ సిబ్బంది, గైడ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేలాదిగా తరలివచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. జూలోని అసిస్టెంట్ క్యూరేటర్‌తో పాటు కిందిస్థాయి అధికారి నిత్యం జూలో పెట్రోలింగ్ నిర్వహిస్తారన్నారు. యానిమల్ కీపర్లు ఆయా ఎన్‌క్లోజర్ల వద్ద ఉంటూ సందర్శకులకు వన్యప్రాణుల విశిష్టతను వివరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూ సందర్శకులు బయటి నుంచి ఎలాంటి ఆహర పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావద్దన్నారు.