గ్రామ రహదారిపై సీసీ కెమెరాలు
కొడకండ్ల : నేరాల అదుపు కోసం మండలకేంద్రంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు రక్షణ, భద్రత లక్ష్యంగా స్థానిక ఎస్సై ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యం తో.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు గల రోడ్డులో ప్రధాన కూడళ్లలో దాదాపు రూ.లక్ష రూపాయల విరాళాలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అధునాతనమైన 8 సీసీ కెమెరాలను విద్యుత్ స్తంభాలకు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క కెమెరా 100 మీటర్ల వరకు చిత్రీకరించే సామర్ధ్యం కలిగిన ఈ కెమెరాల ద్వారా నేరాలు, చోరీలు జరిగినపుడు నిందితులను సులభంగా గుర్తించడమే కాకుండా అజాగ్రత్తగా వాహనాలు నడపడం, చిల్లర తగాదాలు వంటి నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కెమెరాలన్నింటికీ అనుసంధానంగా ప్రత్యేకంగా పోలీసు కమాండ్ కంట్రోల్‌రూంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేరాల నియంత్రణతో పాటు మండలకేంద్ర ప్రజలు రక్షణ, భద్రతే లక్ష్యంగా పోలీసులు ప్రజల భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సీసీ కెమెరాలను ప్రధాన కూడళ్లను ఎంపిక చేసి ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాల బిగింపు పనులు పూర్తవగానే వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దాతల సహకారం అభినందనీయం
ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. తాము పిలుపునిచ్చిన వెంటనే వ్యాపారులు, దాతలు ముందుకొచ్చి సహకరించి విరాళాలు అందించడం అభినందనీయం. నిఘానేత్రాల నిఘాతో శాంతి భద్రతల పరిరక్షణ సులభమవుతుంది. - ఎస్సై ఎంబాడి సత్యనారాయణ
నేరాల అదుపునకు.. నిఘా నేత్రాలు
Published Thu, Jul 14 2016 12:43 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement