‘మీ సేవ’లో సంస్కరణలు
-
∙వినియోగదారులకు సేవలు వేగవంతం
-
∙పారదర్శకత పెంపునకు చర్యలు
కాజీపేట : మీ సేవ కేంద్రాల్లో సంస్కరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విని యోగదారులకు ఇకపై సేవలు వేగవంతం చేసేలా ప్రక్షాళన ప్రారంభించింది. రాష్ట్ర ఆవి ర్బావ వేడుకల నుంచే సంస్కరణ చర్యలు అమల్లోకి వచ్చినట్లు ఆయా కేంద్రాలకు, సం బంధిత అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలో టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాలు, సీఎస్‌సీ, ఈసేవ కేంద్రాలు అన్ని కలిపి సుమారు 600 సెంటర్లు.. 36 విభాగాలకు చెందిన 322 సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈసేవ కేంద్రాలు ప్రతి లావాదేవీకి రూ.5 నుం చి 10 వరకు ప్రభుత్వం నుంచి కమీషన్ పొం దుతున్నాయి. కమీషన్లు సకాలంలోనే అందుతున్నా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో కేంద్రాల్లో లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి తోడు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కేంద్రాలను రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈఎస్‌డీ (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) పర్యవేక్షణ కిందకు తీసుకొచ్చింది. దీంతో ఈఎస్‌డీ నిరంతర పర్యవేక్షణ సాగించి ఈసేవ కేంద్రాల పనితీరును గాడిన పెట్టనుంది.
టీఎస్‌టీఎస్‌కు బాధ్యతలు...
జిల్లాలో మీసేవ కేంద్రాల సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రభుత్వం అమలు చేయనుంది. అన్ని కేంద్రాల్లో నిఘా కెమెరాలను సైతం ఏర్పాటు చేయనుంది. ఇలా హైదరాబాద్ నుం చే అనుక్షణం పర్యవేక్షణ కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అందుబాటులోకి తెస్తున్న సాంకేతిక వ్యవస్థతో కేంద్రాల పనితీరు మెరుగుపర్చి వినియోగదారులకు సకాలంలో సేవలందించేలా కృషిచేస్తున్నారు. మీసేవలో మధ్యవర్తులుగా కొనసాగుతున్న ఏజెన్సీల స్థానంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్‌టీఎస్)కు బాధ్యతలు కట్టబెట్టింది.
నిర్వాహకుల వేతనాల పెంపు...
మీసేవా కేంద్రాల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెన్సీల నిర్వహణ నిబంధనలను కఠినతరం చేసింది. మీసేవ కేంద్రాల్లో పనిచేసే ఆపరేటర్ల జీతాలను ప్రభుత్వం 50 శాతం పెంచింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరి వేతనాలు రూ.10 వేలకు పెరగవచ్చు.
ఇవి కూడా ఏజెన్సీలకు కాకుండా నేరుగా ఆపరేటర్ల ఖాతాల్లో జమ అవుతాయి. ఇకపై మీసేవా కేంద్రాల్లో టోకెన్ పద్ధతి పెట్టి 15 నిమిషాల్లో లావాదేవీలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వినియోగదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.