మోర్తాడ్: మండలంలోని ఏర్గట్లలో జనశక్తి నక్సల్స్ సంచారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. రెండు రోజుల కింద ఏర్గట్లలో సీపీఐ ఎంఎల్ జనశక్తి పార్టీకి చెందిన ఆజ్ఞాత కార్యకర్తలు సభ నిర్వహించి, బ్యానర్‌లను ఏర్పా టు చేశారు.దీంతో ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీ స్తున్నారు. జనశక్తి నక్సల్స్ కదలికలు మొదలైనట్లు ప్రచారం జరుగడంతో పోలీసులు మాజీలను విచారిస్తుండటంతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈనెల 30న నిర్వహించనున్న చండ్రపుల్లారెడ్డి సంస్మరణ సభను విజయవంతం చేయాల ని కోరుతూ జనశక్తి కార్యకర్తలు ఏర్గట్లలోని స్మారక స్థూపం వద్ద బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. బ్యానర్‌లను ఏర్పాటు చేస్తూ పాటలు పాడి అమరవీరులకు నివాళులు అర్పించినట్లు ప్ర చారం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్యానర్‌లను తొలిగించినప్పటికి గ్రామానికి వచ్చిన వారు ఎవరై ఉంటారని వివరాలు సేకరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ నక్సల్స్ కదలికలు కనిపించడం పోలీసులు అప్రమత్తమయ్యారు. జనశక్తి పార్టీకి చెందిన మాజీలపైనా పోలీసులు దృష్టిసారిం చారు. గ్రామంలో జనశక్తి నక్సల్స్ కదలికలు కల్లోలం రేపుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు.
‘జనశక్తి’పై ఆరా
Published Thu, Nov 13 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement