Special Branch
-
విచారణ షురూ?
సాక్షి, చిత్తూరు: నగరంలోని స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసు ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఏసీబీ దృష్టి సారిం చింది. ఇసుక మొదలు.. గ్రానైట్ వరకు ప్రతి అవినీతి పని లోనూ వాటాల రూపంలో ఆయన భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. జిల్లాలోని ప్రతి గ్రానైట్ వ్యాపారి, గ్రా నైట్ ఫ్యాక్టరీ ఓనర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేశారు. ఇవ్వని వారిపై కేసులు నమోదు చేసి, కక్ష సాధింపు ధోరణి అవలంబించారని వ్యాపారులు అంటున్నారు. ఉన్నతాధికారి అండతో.. అప్పటి ఎస్బీ ఉన్నతాధికారి అండతో ఆ పోలీసు చెలరేగి పోయారు. జిల్లాలో వసూళ్లను ఆ ఉన్నతాధికారికి వాటా ఇచ్చేవారు. దీంతో ఆయన ఆ పోలీసుల అవినీతిని చూసీ చూడనట్లు వదిలేశారు. చిత్తూరు చుట్టుపక్కల ఇసుక తవ్వకాలు జరిపే అక్రమార్కుల నుంచి భారీ మొత్తాల్లో సేకరించారు. ఈ అక్రమార్జనతో ఆ ఉన్నతాధికారి, పోలీసు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఏసీబీ అ«ధికారులు గుర్తించారు. వివరాలు ఇచ్చేందుకు సిద్ధం.. ఎస్బీ పోలీసు అక్రమ వసూళ్ల వివరాలు ఏసీబీకి ఇచ్చేం దుకు సిద్ధంగా ఉన్నామని గ్రానైట్ వ్యాపారులు అంటున్నారు. ప్రతి నెలా ఒక్కొక్క గ్రానైట్ క్వారీ నుంచి ఆయనకు రూ.2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఇచ్చుకున్నామని, వీటిపై పక్కా ఆధారాలతో సహా ఏసీబీకి ఇస్తామని వారు చెబుతున్నారు. అక్కడక్కడ జరుగుతున్న లాటరీ, మట్కా నిర్వాహకుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. జిల్లా ఎస్బీ శాఖలో అవినీతిపై.. జిల్లాలో ఎస్బీ శాఖ చేసిన అవినీతిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఐజీ స్థాయిలో విచారణ జరపడానికి రంగం సిద్ధమైంది. త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఇం తలోగా ఏసీబీ కూడా రంగంలోకి దిగబోతోందని తెలుస్తోం ది. దీంతో అప్పట్లో ఇక్కడ అధికారం చెలాయించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
నక్సల్స్ నిధులకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: నక్సలైట్ల ఆదాయ మార్గాలను మూసివేయడంతోపాటు నక్సల్ నేతల ఆస్తులను జప్తు చేయడం కోసం వివిధ దర్యాప్తు సంస్థల అధికారులతో ఓ ప్రత్యేక బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ కేంద్ర సంస్థలతోపాటు రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాల వారు కూడా ఉంటారని హోం శాఖకు చెందిన ఓ అధికారి సోమవారం చెప్పారు. ఈ బృందానికి అదనపు కార్యదర్శి స్థాయి వ్యక్తి నేతృత్వం వహిస్తారనీ, ఐబీ, ఈడీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, సీబీఐ, సీబీడీటీలతోపాటు రాష్ట్రాల నిఘా, నేర దర్యాప్తు విభాగాల అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని అధికారి వివరించారు. నక్సల్ నేతలు బలవంతంగా వసూళ్లకు పాల్పడి, అనంతరం ఆ డబ్బును తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, కుటుంబ సభ్యుల చదువు, విలాసాల కోసం వినియోగిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో హోం శాఖ తాజా చర్య తీసుకుంది. బిహార్–జార్ఖండ్ కమిటీకి చెందిన సీపీఐ (మావోయిస్టు) నేత ప్రద్యుమ్న శర్మ గతేడాది రూ. 22 లక్షలు కట్టి తన సోదరి కూతురిని ఓ ప్రైవేట్ వైద్యకళాశాలలో చేర్పించారు. అదే పార్టీకే చెందిన సందీప్ యాదవ్ అనే మరో నేత నోట్ల రద్దు సమయంలో రూ. 15 లక్షల విలువైన పాత నోట్లను మార్చుకున్నారు. ఆయన కూతురు ఓ ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థలో, కొడుకు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు అధికారి తెలిపారు. మరో సీనియర్ నాయకుడు అరవింద్ యాదవ్ కూడా తన సోదరుడి చదువు కోసం రూ. 12 లక్షలు చెల్లించారన్నారు. -
స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
అనంతపురం సెంట్రల్ : స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా మల్లికార్జున మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఈయనకు గతంలో హిందూపురం టూటౌన్, రామగిరి, డీసీఆర్బీ సీఐగా పనిచేశారు. అనంతరం మహబూబ్‌నగర్ డీఎస్పీగా పదోన్నతిపై వెళ్లారు. తిరిగి బదిలీపై అనంతపురం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా నియమితులయ్యారు. -
స్పెషల్ బ్రాంచ్ ఏంచేస్తున్నట్లు?
సరుబుజ్జిలి : ఆమదాలవసలో సోమవారం నకిలీనోట్ల ముఠా చిక్కడంతో వారిని విచారించి మరింత సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పాతపట్నం మండలానికి చెందిన ఈ ముఠాతో సరుబుజ్జిలి మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన యువకులు ఈ నకిలీనోట్ల వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం మన మధ్య తిరుగుతున్న వ్యక్తులు ఫేక్ కరెన్సీ ముఠాలతో కుమ్మక్కాయ్యారా అంటూ మండలవాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అడ్డదారిలో అధిక సొమ్ము గడించాలన్న దురాశతో పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ దొంగనోట్ల చలామణిలో తెరవెనుక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తెరవెనుక... దొంగనోట్ల వ్యవహారంలో ముఠా సభ్యులు పట్టుబడి సుమారు 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులు ఈ కేసు పురోగతిపై వేగం పెంచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో పాలకపక్షానికి చెందిన కొంతమంది వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినిపించడంతో పోలీసులు వెనుకంజవేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొద్దునిద్రలో స్పెషల్ బ్రాంచ్! మండలంలో నకిలీ నోట్ల ముఠాలు సంచరిస్తున్నట్లు చాలా కాలం నుంచి విమర్శలున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను ముందస్తుగా అంచనాలు వేసి పోలీసు ఉన్నతాధికారులకు పంపించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విధి. నకిలీ క రెన్సీ ముఠాల విషయంలో పలుమార్లు స్వయంగా, పత్రికలు ద్వారా వారిని అప్రత్తంచేసినా స్పందనలేదు. దీంతో ముందస్తు సమచారంలేక పోలీసులు నకిలీ కరెన్సీ ముఠాలను అరికట్టడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. -
స్పెషల్ బ్రాంచ్‌కు 'ఆ ఇద్దరు'
అనంతపురం : అనంతపురం జిల్లా ఇటుకపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్‌ను స్పెషల్‌బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 29న రాప్తాడు మండల వైఎస్సార్సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. స్వయానా పోలీస్‌స్టేషన్ పక్కన, తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం వెనుక స్థానిక పోలీసులు నిఘా వైఫల్యమైందని భావించిన ఉన్నతాధికారులు సీఐ, ఎస్ఐను వీఆర్‌కు పంపుతూ చర్యలు తీసుకున్నారు. అయితే నాటి నుంచి వారిని రిలీవ్ చేయకుండా అలాగే కొనసాగించారు. వారిని వీఆర్‌కు పంపడాన్ని మంత్రి సునీత సీరియస్‌గా పరిగణించి... రాష్ట్ర హోంశాఖ మంత్రితో చర్చించి అధికారులపై ఒత్తిడి చేయించారనే అరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా వారిని వీఆర్‌కు పంపడాన్ని నిరసిస్తూ మంత్రి సునీత తన గన్మెన్లు, భద్రత సిబ్బందిని వెనక్కు పంపడంతో పోలీసు ఉన్నతాధికారులు సందేహంలో పడ్డారు. కాగా అనంతపురం డీఐజీ బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ సీఐ, ఎస్ఐ ఇద్దర్నీ వీఆర్‌కు పంపామని అయితే శివప్రసాద్‌రెడ్డి హత్యకేసులో నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉన్నందున తాత్కాలికంగా వారిని కొనసాగిస్తున్నామన్నారు. అంతేకాకుండా నిందితులు అరెస్ట్ కాగానే వారిని వీఆర్‌కు పంపుతామని ప్రకటించారు. వారిద్దరని వీఆర్‌కు కాకుండా స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేయడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడేనన్న ప్రచారం జరుగుతుంది. కాగా ఇటుకులపల్లి సీఐగా ప్రస్తుతం పెనుకొండ సీఐగా పని చేస్తున్న రాజేంద్రనాథ్‌యాదవ్‌ను, రాప్తాడు ఎస్ఐగా జీటీ నాయుడును జిల్లా ఎస్పీ నియమించారు. -
‘జనశక్తి’పై ఆరా
మోర్తాడ్: మండలంలోని ఏర్గట్లలో జనశక్తి నక్సల్స్ సంచారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. రెండు రోజుల కింద ఏర్గట్లలో సీపీఐ ఎంఎల్ జనశక్తి పార్టీకి చెందిన ఆజ్ఞాత కార్యకర్తలు సభ నిర్వహించి, బ్యానర్లను ఏర్పా టు చేశారు.దీంతో ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీ స్తున్నారు. జనశక్తి నక్సల్స్ కదలికలు మొదలైనట్లు ప్రచారం జరుగడంతో పోలీసులు మాజీలను విచారిస్తుండటంతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈనెల 30న నిర్వహించనున్న చండ్రపుల్లారెడ్డి సంస్మరణ సభను విజయవంతం చేయాల ని కోరుతూ జనశక్తి కార్యకర్తలు ఏర్గట్లలోని స్మారక స్థూపం వద్ద బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్లను ఏర్పాటు చేస్తూ పాటలు పాడి అమరవీరులకు నివాళులు అర్పించినట్లు ప్ర చారం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్యానర్లను తొలిగించినప్పటికి గ్రామానికి వచ్చిన వారు ఎవరై ఉంటారని వివరాలు సేకరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ నక్సల్స్ కదలికలు కనిపించడం పోలీసులు అప్రమత్తమయ్యారు. జనశక్తి పార్టీకి చెందిన మాజీలపైనా పోలీసులు దృష్టిసారిం చారు. గ్రామంలో జనశక్తి నక్సల్స్ కదలికలు కల్లోలం రేపుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. -
అష్ట దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మున్సిపల్, జెడ్పీ, సార్వత్రిక ఎన్నికల నిర్వహణను పోలీసు ఉన్నతాధికారులు సవాల్‌గా తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ), స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్‌వోజీ) ద్వారా జిల్లాను జల్లెడ పడుతోన్న పోలీసు ఉన్నతాధికారులు.. రౌడీషీటర్లు, సంఘ విద్రోహక శక్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎన్నికల్లో ఇబ్బందులు సృష్టిస్తారని భావించిన వారిని బైండోవర్ చేస్తున్నారు. 3,800 పోలీసు సిబ్బందితోపాటు నాలుగు కంపెనీ(నాలుగు వేల మంది)ల బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలను జిల్లాలో ఇప్పటికే మోహరించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నాటికి మరో ఐదు వేల మంది సాయుధ పోలీసులను జిల్లాకు పంపాలని డీజీపీ ప్రసాదరావుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ లేఖ రాశారు. ఆ బలగాలను సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలోనే ఉంచాలని కోరారు. వివరాల్లోకి వెళితే.. సుప్రీంకోర్టు కన్నెర్ర చేయడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసిన విషయం విదితమే. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. తాజాగా సుప్రీంకోర్టు కన్నెర్ర చేయడంతో ఆదివారం గానీ.. సోమవారం గానీ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలును విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈలోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు రానే వచ్చింది. కొద్ది రోజుల తేడాలోనే మూడు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు విడుదల కావడం.. వాటిని నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా. అలాంటి వాతావరణం కల్పించడానికి పోలీసు ఉన్నతాధికారులు నడుం బిగించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో 2013 జూలైలో జిల్లాకు నాలుగు కంపెనీల బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలు వచ్చిన విషయం విదితమే. జిల్లా పోలీసు శాఖలో 3,800 మంది పనిచేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం 7,800 మంది సాయుధ పోలీసులను జిల్లాలో మోహరించారన్న మాట. ఎస్పీ సెంథిల్‌కుమార్ నేతృత్వంలోని స్పెషల్ బ్రాంచ్, ఎస్‌వోజీ విభాగం జిల్లాను వడబోస్తోంది. రౌడీషీటర్లు, నేరచరితులను గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. ఆ ఆదేశాలను కొందరు సీఐలు వక్రీకరించి.. ఎలాంటి నేరచరిత్ర లేని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. కౌన్సిలింగ్ ద్వారా సంఘ విద్రోహక శక్తులకు గుణపాఠం చెప్పిన పోలీసులు.. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. అడుగడుగునా చెక్‌పోస్టులే.. ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం, అక్రమాయుధాలకు అడ్డుకట్ట వేయడానికి జిల్లాలో అడుగడుగునా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అనంతపురం నగరంతోపాటు 11 మున్సిపాల్టీల పరిధిలో 63 చెక్‌పోస్టులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల్లో చేసిన తనిఖీల్లో ఇప్పటికే రూ.2.70 కోట్ల డబ్బును పట్టుకుని.. ఆదాయపు పన్ను శాఖకు స్వాధీనం చేశారు. భారీ ఎత్తున మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే చెక్‌పోస్టుల ద్వారా ఎర్రచందనం దుంగలను కూడా పట్టుకున్నారు. కర్ణాటకలోని తుమకూరు, బళ్లారి తదితర జిల్లాలతో మన జిల్లాకు సరిహద్దు ఉంది. కర్ణాటక ప్రాంతం నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యం, డబ్బు జిల్లాలోకి వివిధ రాజకీయ పార్టీల నేతలు తెస్తున్నారు. కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యం, డబ్బు జిల్లాకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు నడుంబిగించారు. జిల్లా సరిహద్దుల్లో 48 ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేయాలని.. వాటిలో పూర్తిగా బీఎస్ఎఫ్ జవాన్లనే నియమించాలని నిర్ణయించారు. తనిఖీలను ముమ్మరం చేయడం ద్వారా డబ్బు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలపై డేగకన్ను.. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను 750.. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను 2,560.. సార్వత్రిక ఎన్నికలను 3,310 పోలింగ్ కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన ఎన్నికల పోలింగ్‌ను పరిగణనలోకి తీసుకుని.. ఆ పోలింగ్ కేంద్రాలను నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. సాధారణ, సమస్యాత్మక, సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా వర్గీకరించారు. అందుకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘం పరిశీలనకు పంపారు. ఎన్నికల సంఘం ఆమోదించిన తర్వాత ఆ కేంద్రాల్లో పోలింగ్ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేస్తామని ఎస్పీ సెంథిల్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఫోర్జరీ సంతకాలతో బెయిల్!
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు కోర్టుకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ ష్యూరిటీ పత్రాలు సమర్పించిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. వారి నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చంద్రగిరి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో తమిళనాడుకు చెందిన వందలాది మంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు పట్టుబడ్డారు. మరికొంత మంది చిన్న చిన్న నేరాలకు పాల్పడి అరెస్టయ్యారు. వారిని బెయిల్‌పై బయటకు తీసుకు వచ్చేందుకు చంద్రగిరి మండలానికి చెందిన ఇద్దరు యువకులు రంగంలోకి దిగారు. తిరుపతిలోని కోర్టు భవనాల సముదాయం వద్ద వీరు నిందితుల బంధువులతో పెద్దమొత్తం డబ్బుకు ఒప్పందం కుదుర్చుకునేవారు. ఆ మేరకు బెయిల్‌కు కావాల్సిన ష్యూరిటీ పత్రాలు, అందుకు అవసరమైన తహశీల్దార్, ఎంపీడీవోల సంతకాలు, గ్రామరెవెన్యూ అధికారుల సంతకాలను వీరే ఫోర్జరీ చేసేవారు. తాము తయారు చేయించిన రబ్బర్ స్టాంపులతో అధికారుల సీల్ వేసి కోర్టులకు సమర్పించేవారు. ఈ వ్యవహారం ఆరు నెలలుగా సాగుతోంది. ఇటీవల చంద్రగిరి మండలం నుంచే ఎక్కువ బెయిల్ పిటిషన్లు దాఖలు కావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అనుమానం వచ్చింది. వీటిపై విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎంతమందికి బెయిల్ ఇచ్చారనే సమాచారం రాబట్టడం కోసం నిందితులను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. వీరు సమర్పించిన ష్యూరిటీల్లోని సంతకాలకు సంబంధించి చంద్రగిరి, తొండవాడ వీఅర్వోలను అర్బన్ ఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించినట్లు తెలిసింది. బెయిల్ పిటిషన్లలో ఉన్న సంతకాలు తమవి కావని చెప్పినట్లు సమాచారం. -
ఏడాదిగా భార్యను వేదిస్తున్న SI అనిల్