సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దులో భేటీ అయ్యారా? ములుగు, కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న వీరాపూర్ సమీపంలో మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏరియా కమిటీల సమావేశం నిర్వహించారా? అంటే.. అవుననే అంటున్నాయి పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు. సమావేశాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టు నేత దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించారా..? లేక దామోదర్ సమక్షంలోనే సమావేశాలు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఆ పోలీస్ స్టేషన్‌లో ఖాకీబాస్‌ల సమావేశం?
మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైన నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ములుగు జిల్లా అటవీ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ అధికారి ప్రభాకర్ రావు, అడిషనల్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీలు నాగిరెడ్డి, రవివర్మలు, నార్త్‌జోన్ ఐజీ చంద్రశేఖర్‌లతోపా టు సీఆర్పీఎఫ్ చీఫ్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులతో వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో సమావేశమయ్యారు.
ఈ క్రంలో అక్కడ భారీగా సీర్పీఎఫ్ బలగాలు మోహరించా యి. వెంకటాపురం, పాలం ప్రాజెక్టు, పెనుగోలు, కొత్తపల్లి, బీజాపూర్ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘాను పర్యవేక్షించిన అ«ధికారులు డ్రోన్‌లను ఎగురవేసి పరిస్థితిని పరిశీలించినట్లు తెలిసింది. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా ముందస్తు చర్య ల్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం 3 రాష్ట్రాల సరిహద్దులో పర్యటించినట్లు తెలిసింది.
మూడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్..
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల సరిహద్దులో పోలీసులు మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత 50 కిలోల శక్తివంతమైన మందుపాతర పేల్చి 10 మంది డీఆర్‌జీ (డి్రస్టిక్ట్ రిజర్వ్‌డ్ గ్రూప్) జవాన్లు, డ్రైవరును చంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో ఓ దళకమాండర్, ఇద్దరు సభ్యలు మృతి చెందారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతాన్ని మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలోకి మావోలు చొరబడే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment