నిధుల వాడకంపై సర్కారు ఆరా | Government inquired on the funds usage | Sakshi
Sakshi News home page

నిధుల వాడకంపై సర్కారు ఆరా

Published Sat, Jan 7 2017 4:04 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

నిధుల వాడకంపై సర్కారు ఆరా - Sakshi

నిధుల వాడకంపై సర్కారు ఆరా

బడ్జెట్‌ అంచనాలు, గత బడ్జెట్‌ సవరణల సమర్పణకు ఆదేశం
నిధుల మంజూరు, చేసిన ఖర్చు వివరాలివ్వాలని సర్క్యులర్‌ జారీ
బడ్జెట్‌ కసరత్తుపై మంత్రివర్గ భేటీలోగా సమర్పించాలని ఆదేశం
నిధుల దుర్వినియోగంపై సీఎంవో అంతర్గత సర్వే
24 ప్రభుత్వ శాఖల పనితీరుపై ఇంటలిజెన్స్‌ నివేదికకు సీఎం ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల వినియోగం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. రానున్న బడ్జెట్‌ అంచనాలతోపాటు గత బడ్జెట్‌ సవరణ ప్రతిపాదనలను సమర్పించాలని అన్ని శాఖలను ఆదేశించింది. 2016–17 బడ్జెట్‌లో కేటాయించిన, మంజూరైన నిధులు, ఖర్చు, చేపట్టిన పనులు, మరిన్ని నిధుల అవస రం వివరాలను పంపాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సరŠుక్యలర్‌ జారీ చేసింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలోగా వివరాలను సమర్పించాల్సి ఉందని, అందుకే సమగ్ర ప్రతి పాదనలు పంపించాలని అప్రమత్తం చేసింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం వివిధ శాఖల ఆదాయ వ్యయాలపై ఏ మేరకు ప్రభావం చూపిందనే వివరాలను విడిగా నివేదిక రూపం లో ఇవ్వాలని కోరింది. బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చులు, దుర్వినియోగం ఫిర్యాదులపై సీఎం కార్యాలయం ప్రత్యేకంగా ఆరా తీస్తోంది.

ప్రతి పైసాకూ లెక్కుందా?
వివిధ శాఖల్లో నిధుల వినియోగం జరిగిన తీరుపై రాష్ట్ర ఇంటలిజెన్స్‌ నేతృత్వంలో పూర్తిస్థాయి నివేదికను సీఎం కేసీఆర్‌ కోరినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ముఖ్యంగా 24 ప్రభుత్వ ప్రధాన విభాగా ల్లో నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ఇంటలిజెన్స్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ద్వారా సర్వే చేయించి నివేదిక రూపొందించే పని మొదలైంది. రెండు విభాగాల ఆధ్వర్యంలో మొత్తం 16 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి కేటాయించిన నిధులు, ఆర్థిక శాఖ మంజూరు చేసిన నిధులు, వాటిలో ఎంత ఖర్చు చేశారన్న అంశాలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించారు. ఖర్చు చేసిన నిధులతో ఎంత మేరకు పనులు, కార్యక్రమాలు జరిగాయనే కోణంలో మరో నమూనా తయారుచేశారు. నిధులుండి కూడా పనులు ప్రారంభం కాకున్నా, పనులు ప్రారంభమై నిధులు దుర్వినియోగం జరిగిన ఆరోపణలుంటే నివేదించేందుకు వీలుగా మూడో ప్రొఫార్మా రూపొందించారు. ఈ మూడు కోణాల్లో సర్వే చేసేందుకు ఇంటలి జెన్స్, విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు జరగ నుండటంతో ఈ బృందాలు తమ సర్వేను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

మూడు దశలుగా సర్వే...
మొదటగా విద్యుత్, గృహ నిర్మాణం, ఆరోగ్య, విద్యా శాఖలపై దృష్టి సారించాలని అధికారులు సర్వే బృందాలను ఆదేశించారు. రెండో దశలో సంక్షేమ, వ్యవసాయం, నీటిపారుదల శాఖల అంశాలు, తర్వాత మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలపై నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. మిగిలిన విభాగాలను చివరగా సర్వే చేయించి 10–15 రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందించాలని నిర్ణయించారు. ఈ నివేదిక ఆధారంగా వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలను సీఎం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతి విభాగంలో మంత్రులు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పనితీరును సైతం నివేదిక ద్వారా ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement