ఉగ్రవాదం అంతమే లక్ష్యం : అమిత్‌షా | Rahul Gandhi Want To Push Jammu And Kashmir Back Into Terrorism Says Amit Shah | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదం అంతమే లక్ష్యం : అమిత్‌షా

Published Mon, Sep 16 2024 4:37 PM | Last Updated on Mon, Sep 16 2024 5:05 PM

Rahul Gandhi Want To Push Jammu And Kashmir Back Into Terrorism Says Amit Shah

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఈ సందర్భంగా మొదటి దశ ప్రచారానికి చివరి రోజున కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కిష్త్వార్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌ను తిరిగి తీవ్రవాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  

కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) తీవ్రవాదంపై అలసత్వం ప్రదర్శిస్తున్నాయని, ఉగ్రవాదులు,దాడులకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి విడిచి పెట్టాలని యోచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ఈ ప్రాంత అమరవీరుల్ని స్మరించుకుంటూ.. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని హామీ ఇస్తున్నాను’అని అన్నారు.ఆర్టికల్ 370 రద్దు చేసిన చరిత్ర బీజేపీదేనని పునరుద్ఘాటించారు.  

కాగా,జమ్మూ కశ్మీర్‌ ఎన్నికలు మూడు దశల్లో సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1న జరగనున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబర్‌ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలకు అక్టోబర్‌ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
 

ఇదీ చదవండి : సందీప్‌ ఘోష్‌ ఓ అబద్ధాల పుట్ట.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement