శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పలు జిల్లాలో పోలీసులు యాంటీ టెర్రర్ పేరుతో వరుస దాడులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ లబైక్ యా ముస్లింను(టీఎల్‌ఎమ్) విచ్చిన్నం చేశారు. ఇది ల్కరే తోయిబా అనుబంధ శాఖ అని, బాబా హమాస్ అనే పాకిస్తానీ వ్యక్తి మార్గదర్శకత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీస్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ విభాగం వెల్లడించింది.
శ్రీనగర్, గాందర్‌బల్, బందిపోరా, కుల్గాం, బుద్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. గాందర్‌బల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందిన నేపథ్యంలో భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. తీవ్రవాద కార్యకలాపాల నిమిత్తం ఇటీవల కాలంలో టీఎల్‌ఎం భారీగా యువతను రిక్రూట్ చేసుకుంటోందని, ఆ రిక్రూట్‌మెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆ సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
టీఎల్‌ఎమ్ ఇటీవల ఏర్పడిన సం స్థ అయినప్పటికీ.. స్థానికంగా ఉగ్రవాద గ్రూపులలో ఒకటైన లష్కరే తోయిబాతో సైద్ధాంతిక, రవాణా సంబంధాలను కలిగి ఉన్నట్లు, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని, చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment