terror group
-
యాంటీ టెర్రర్ ఆపరేషన్.. కొత్తగా ఏర్పడిన ఉగ్ర సంస్థ విచ్ఛిన్నం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పలు జిల్లాలో పోలీసులు యాంటీ టెర్రర్ పేరుతో వరుస దాడులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ లబైక్ యా ముస్లింను(టీఎల్ఎమ్) విచ్చిన్నం చేశారు. ఇది ల్కరే తోయిబా అనుబంధ శాఖ అని, బాబా హమాస్ అనే పాకిస్తానీ వ్యక్తి మార్గదర్శకత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీస్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ విభాగం వెల్లడించింది.శ్రీనగర్, గాందర్బల్, బందిపోరా, కుల్గాం, బుద్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. గాందర్బల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందిన నేపథ్యంలో భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. తీవ్రవాద కార్యకలాపాల నిమిత్తం ఇటీవల కాలంలో టీఎల్ఎం భారీగా యువతను రిక్రూట్ చేసుకుంటోందని, ఆ రిక్రూట్మెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆ సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.టీఎల్ఎమ్ ఇటీవల ఏర్పడిన సం స్థ అయినప్పటికీ.. స్థానికంగా ఉగ్రవాద గ్రూపులలో ఒకటైన లష్కరే తోయిబాతో సైద్ధాంతిక, రవాణా సంబంధాలను కలిగి ఉన్నట్లు, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని, చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నాయి. -
ఉగ్ర కుట్ర: రూ. 50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
కశ్మీర్: జమ్మూ కశ్మీర్ పోలీసులు సోమవారం పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన నార్కో-టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. ఓ ఉగ్రవాదిని అరెస్టు చేయడమే కాక, కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. 8 కిలోల హెరాయిన్ తీసుకెళ్తున్న ఈ గ్రూప్ గురించి జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో కాపుగాసి మాటేసిన పోలీసులు ఈ గ్రూప్‌కు చెందిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఇతడిని మదాసిర్ అహ్మద్‌గా గుర్తించారు. "ఈ గ్రూప్, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఈ గ్రూపు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ లోయలో యాక్టీవ్‌గా ఉన్న ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ రికవరీలు మాదకద్రవ్యాల డీలర్లకు, ఉగ్రవాదులకు మధ్య పరస్పరం ఉన్న సంబంధాన్ని కూడా బహిర్గతం చేశాయి" అని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ గ్రూపు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలపు బలోపేతం చేయడానికి పని చేస్తోంది. అంతేకాక స్థానిక యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోంది అన్నారు ఐజీ విజయ్ కుమార్. ఇక పట్టుబడిన ఈ 8 కిలోగ్రామలు హెరాయిన్ మార్కెట్ విలువ 50 కోట్ల రూపాయల ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మాదక ద్రవ్యాల రవాణాలో తో పాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నాడని.. కాని అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: 8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్ -
ఆ 40 వెబ్సైట్లపై వేటు!
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాద కార్యకలాపాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)కు చెందిన 40 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్టు హోంమంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అమెరికాకు చెందిన ఎస్ఎఫ్జే ఖలిస్తాన్ అనుకూల ఉగ్ర సంస్థ. ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం పనిచేసే వారిని నిషేధిత ఎస్ఎఫ్జే ప్రోత్సహిస్తోంది. హోంమంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా ఎలక్ర్టానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎస్ఎఫ్జేకు చెందిన 40 వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ గత ఏడాది ఎస్ఎఫ్జేను హోంమంత్రిత్వ శాఖ నిషేధించింది. ఎస్ఎఫ్జే బాహాటంగా ఖలిస్తాన్‌కు మద్దతు ఇస్తోందని, ఫలితంగా దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భౌగోళిక స్వరూపాలకు సవాళ్లు ఎదురవుతాయని హోం మంత్రిత్వ శాఖ అధికారి వ్యాఖ్యానించారు. వేర్పాటువాద అజెండాతో ముందుకొచ్చిన ఎస్ఎఫ్జే ఖలిస్తాన్‌పై సిక్కుల రిఫరెండంకు పిలుపుఇచ్చింది. చదవండి : పంజాబ్‌లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్.. -
‘నన్నెవరు కిడ్నాప్ చేయలేదు’
అబుదాబి: కిడ్నాప్ చేసి.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చినట్లు ప్రచారం జరుగుతున్న కేరళ యువతి ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చారు. ప్రేమించిన వ్యక్తి కోసం తాను అబుదాబి వెళ్లానని.. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. వివరాలు.. కేరళ కోజికోడ్‌కు చెందిన 19 ఏళ్ల సియానీ బెన్ని అనే యువతి ఢిల్లీలోని జీసస్ అండ్ మేరి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18 నుంచి సియానీ కనిపించకుండా పోయారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సియానీ అబుదాబి వెళ్లినట్లు గుర్తించారు. దాంతో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సియానీ మీడియా ముందుకు వచ్చారు. తనను కిడ్నాప్ చేశారంటూ వస్తోన్న వార్తల్ని ఖండించారు. ప్రేమించిన యువకుడి కోసం తాను అబుదాబి వెళ్లానని తెలిపారు. ఈ సందర్భంగా సియానీ మాట్లాడుతూ.. ‘అబుదాబిలో స్థిరపడిన భారత సంతతి వ్యక్తితో 9 నెలల క్రితం నాకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. అతడిని వివాహం చేసుకోవడం కోసమే నేను అబుదాబి వెళ్లాను. నా ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. భారత్‌కు చెందిన నేను మేజర్ని. నా జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు నాకుంది’ అని తెలిపారు. అంతేకాక తన ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారానని అబుదాబి కోర్టులో కూడా తెలిపానన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం తనను కలుసుకోవడానికి అబుదాబి వస్తున్నారని పేర్కొన్నారు సియానీ. తనకు ఇండియా వచ్చే ఉద్దేశం లేదని.. ఇక్కడే ఉంటానని.. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని సియానీ స్పష్టం చేశారు. అంతేకాక తనను కిడ్నాప్ చేశారంటూ ప్రచారం చేస్తోన్న వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
డ్రోన్లతో భారత్‌లోకి పాక్ ఆయుధాలు
చండీగఢ్: పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రమూకలు సెప్టెంబర్ 9 నుంచి 16 వరకు డ్రోన్ల ద్వారా 80 కేజీల బరువుగల ఆయుధాలూ, మందుగుండు సామాగ్రిని సరిహద్దులగుండా భారత్‌లోనికి జారవిడిచినట్టు భారత భద్రతాదళాలూ, పంజాబ్ పోలీసులు ధృవీకరించారు. కశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం పాకిస్తాన్ గూఢచారి వ్యవస్థ మద్దతుతో ఖలిస్థాన్ తీవ్రవాద శక్తులు ఈ చర్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అమృత్‌సర్‌లోని తరన్ తరన్ జిల్లాలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధసామగ్రిపై విచారణ జరపడంతో విషయంవెలుగులోకి వచ్చింది. పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడం కోసం పాకిస్తాన్, జర్మనీ మద్దతుతో ఖలిస్తాన్ జిందాబాద్ ఉగ్రమూకలు కుట్రపన్నుతున్నట్టు భారత భద్రతాదళాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సరిహద్దుల్లో 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ డ్రోన్లను పంపించారు. అయితే ఇవి 2000 అడుగుల ఎత్తులో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 1200 అడుగుల కిందకి దిగి ఆయుధాలను జారవిడిచినట్టు వెల్లడయ్యింది. డ్రోన్ల ద్వారా జారవిడిచిన వాటిలో ఐదు ఏకే – 47 తుపాకులు, 16 మ్యాగజైన్స్, 472 రౌండ్లకు సరిపడా మందుగుండ్లు, చైనాలో తయారైన నాలుగు 30 బోర్ పిస్టల్స్ తదితర సామాగ్రితో పాటు ఐదు సాటిలైట్ ఫోన్లు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వైర్లెస్ సెట్లు, 10 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. డ్రోన్లు వస్తే పేల్చేస్తాం హిసార్: ఇతర దేశాల సరిహద్దుల నుంచి భారత్‌లోకి ఎలాంటి డ్రోన్లు, అనుమానిత పరికరాలు ప్రవేశించినా వెంటనే పసిగట్టే సత్తా మన సైనిక దళాలకు ఉందని సౌత్ వెస్ట్రన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్‌సింగ్ క్లేర్ చెప్పారు. భారత్–పాక్ సరిహద్దు వెంట ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో ఆయుధాలను జార విడుస్తున్నా రంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌లోకి వైపు డ్రోన్లు ప్రవేశిస్తే వెంటనే పేల్చేస్తామని స్పష్టం చేశారు. డ్రోన్ల గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల సామర్థ్యం పరిమితమేనన్నారు. -
‘అంతా బాగుంటే.. 38 వేల మంది ఎందుకు’
కశ్మీర్: నరేంద్ర మోదీ ప్రభుత్వం 38 వేల మంది అదనపు దళాలను జమ్మూకశ్మీర్‌కు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. 10 వేల మంది, 28 వేల మంది వారిగా రెండు బ్యాచులుగా బలగాలను కశ్మీర్ లోయలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. కశ్మీర్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కశ్మీర్ లోయలో శాంతి భద్రతలు మెరగు పడ్డాయని స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘2018తో పోలిస్తే.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు మెరుగు పడ్డాయి. ఉగ్ర చొరబాట్లు 43శాతం, ఉగ్రవాద సంఘటనలు 28 శాతం తగ్గాయి. భద్రతా దళాలు ప్రారంభించిన చర్యలు 59శాతం పెరగడంతో.. ఉగ్రవాదుల చర్యలను తటస్థీకరించడంలో మంచి అభివృద్ధి సాధించాం’ అంటూ కిషన్ రెడ్డి గత నెల 24న రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. భద్రతా దళాల కృషి వల్ల ఇప్పటి వరకూ 126 మంది ఉగ్రవాదులను అంతమోందించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా కశ్మీర్‌కు 38 వేల మంది దళాలను పంపాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు.. ‘కశ్మీర్లో ఉగ్రకార్యకలపాలు తగ్గాయి.. శాంతి భద్రతలు మెరుగుపడ్డాయంటూనే.. ఇంత భారీ ఎత్తున దళాలను ఎందుకు మోహరిస్తున్నారు’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే రానున్న శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పాక్, కశ్మీర్లో భారీ ఎత్తున చొరబాట్లను ప్రోత్సాహిస్తూ.. లోయలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నింస్తుందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర భారీ ఎత్తున దళాలను కశ్మీర్లో మోహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతే కాక ఈ ఏడాదిలో కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. -
ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్
ఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులిద్దరు జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన షహనవాజ్ అహ్మద్, పుల్వామాకు చెందిన అక్విబ్ అహ్మద్‌గా గుర్తించారు. యూపీ డీజీపీ ఓపీ సింగ్ వివరాలను వెల్లడించారు. జమ్ముకాశ్మీర్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు యూపీ పోలీసులు తెలిపారు. -
ఐఎస్ఐఎస్ దారుణాలు ఇవి!
రక్కా, మొసుల్ పట్టణాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఇటీవల సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో వారు డమాస్కస్‌లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. డమాస్కస్‌లో తమ పాలనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పబ్లిష్ చేసింది. ఈ ఫోటోల్లో కొన్ని ఐఎస్ ఉగ్రవాదులు అమలు చేస్తున్న క్రూరమైన శిక్షలతో పాటు.. వారి ఆంక్షలకు సంబంధించినవి ఉన్నాయి. హోమో సెక్సువల్ నేరానికి పాల్పడినందుకు గాను ఓ వ్యక్తిని బిల్డింగ్ మీద నుంచి తోసివేసిన ఫోటోతో పాటు.. ఓ ముసుగువేసిన ఖైదీని మోకాళ్లపై కూర్చోబెట్టి షూట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అలాగే టీషర్ట్‌లపై ఉన్న బ్రాండ్ లోగోలను తొలగిస్తూ, ప్యాంటు పొడవు కొలతలు చూస్తూ వారు విధించిన ఆంక్షలకు సంబంధించిన ఫోటోలు ఐఎస్ఐఎస్ విడుదల చేసింది. -
అమెరికా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్
కరాచీ: భారత్‌పై ఎలాంటి ఉగ్ర దాడులు జరగకుండా చూడాలన్న అమెరికా ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. దీనిలో భాగంగానే హఫీజ్ సయ్యిద్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాపై పాక్ తాజాగా నిషేధం విధించింది. భారత్ లో సీమాంతర ఉగ్రవాద దాడి జరగకుండా చూడాలని పాకిస్తాన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒకవేళ అలాంటి దాడి ఏదైనా జరిగితే, అది పాక్ నుంచే జరిగిందని వెల్లడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముందస్తు చర్యల్లో భాగంగా జమాత్ ఉద్ దవా పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒబామా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఒబామా.. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు బహిరంగ వేదికపై ఉండనున్నారు. దీంతో ఆయన భద్రత విషయమై అమెరికా, భారత భద్రతా సంస్థలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని ఐబీ (నిఘా సంస్థ) హెచ్చరికలు జారీ చేయడంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు.