terror actions
-
యాంటీ టెర్రర్ ఆపరేషన్.. కొత్తగా ఏర్పడిన ఉగ్ర సంస్థ విచ్ఛిన్నం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పలు జిల్లాలో పోలీసులు యాంటీ టెర్రర్ పేరుతో వరుస దాడులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ లబైక్ యా ముస్లింను(టీఎల్ఎమ్) విచ్చిన్నం చేశారు. ఇది ల్కరే తోయిబా అనుబంధ శాఖ అని, బాబా హమాస్ అనే పాకిస్తానీ వ్యక్తి మార్గదర్శకత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీస్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ విభాగం వెల్లడించింది.శ్రీనగర్, గాందర్బల్, బందిపోరా, కుల్గాం, బుద్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. గాందర్బల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందిన నేపథ్యంలో భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. తీవ్రవాద కార్యకలాపాల నిమిత్తం ఇటీవల కాలంలో టీఎల్ఎం భారీగా యువతను రిక్రూట్ చేసుకుంటోందని, ఆ రిక్రూట్మెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆ సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.టీఎల్ఎమ్ ఇటీవల ఏర్పడిన సం స్థ అయినప్పటికీ.. స్థానికంగా ఉగ్రవాద గ్రూపులలో ఒకటైన లష్కరే తోయిబాతో సైద్ధాంతిక, రవాణా సంబంధాలను కలిగి ఉన్నట్లు, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని, చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నాయి. -
రూ.55 వేలకోట్ల దావూద్ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. పాకిస్థాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ నివేదికలపై ఎలాంటి ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు. దావూద్ కరాచీలో ఉంటున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మూడు దశాబ్దాలుగా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాకిస్థాన్ అడ్డాగా దందాలు, అక్రమ వ్యాపారాలను నడుపుతున్నాడు. దావూద్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది. అతని భార్య జుబీనాజరీన్, సోదరుడు అనీస్ సహకారంతో ఇదంతా నడుస్తోందని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. 1980-90 మధ్య కాలంలో దావూద్ వ్యభిచారం, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వ్యాపారాలతో కోట్లు గడించాడు. ప్రపంచ ఉగ్రవాద సంస్థ డీ-కంపెనీకి అధిపతిగా మారాడు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు నిర్వహిస్తున్న కొన్ని వ్యాపారాలు ఈ కింది విధంగా ఉన్నట్లు సమాచారం. చమురు, లూబ్రికెంట్లు: ఒయాసిస్ ఆయిల్ & లూబ్ ఎల్సీసీ అనే దుబాయ్ ఆధారిత కంపెనీ చమురు, లూబ్రికెంట్ల వ్యాపారం సాగిస్తోంది. ఇది డీ-కంపెనీల్లో ఒకటిగా ఉన్నట్లు తెలిసింది. డైమండ్స్: అల్-నూర్ డైమండ్స్ అనేది దుబాయ్‌లోని వజ్రాల వ్యాపార సంస్థ. ఇది డి-కంపెనీకి మనీలాండరింగ్‌కు సహకరిస్తుందని గతంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పవర్: ఒయాసిస్ పవర్ ఎల్సీసీ దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సెక్టార్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది డీ-కంపెనీకి సహకరిస్తుందని నమ్ముతుంటారు. నిర్మాణ రంగం: డాల్ఫిన్ కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం, రియల్ ఎస్టేట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది డీ-కంపెనీకి మద్దతు తెలుపుతుందని కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఎయిర్‌లైన్స్: ఈస్ట్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ను దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం స్థాపించాడు. ఈ సంస్థను స్మగ్లింగ్, పన్ను ఎగవేత ఆరోపణలతో 1996లో మూసివేశారు. ఇవి దావూద్ ఇబ్రహీం, అతడి డీ-కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కొన్ని కంపెనీలని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి నిర్థారణలు లేవు. దావూద్ పాకిస్థాన్, యుఏఈ, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కొందరు చెబుతుంటారు. అతను హవాలా మనీతో ఈ సమ్రాజ్యాన్ని సృష్టించారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, గన్ సప్లైతో దావూద్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఫోర్బ్స్ ప్రకారం గ్యాంగ్స్టర్లలో దావూద్ అధిక ధనవంతుడిగా నిలిచాడు. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం అప్పట్లోనే రూ.55 వేల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే.. దావూద్ పేరుపై ఒక హోటల్ కూడా ఉంది. ఇప్పటికే దావూద్‌కు చెందిన అనేక ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పైగా ఇండియాలో ముంబైతో పాటు ఇతర నగరాల్లో సైతం ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. 2జీ స్పెక్ట్రమ్ సహా అనేక కుంభకోణాల్లో దావూద్ పాత్ర ఉందని తెలిసింది. -
Sikh for Justice: వరల్డ్ కప్ కాదు.. టెర్రర్ కప్
అహ్మదాబాద్: కరడుగట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపట్వంత్ సింగ్ పన్నూపై గుజరాత్ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ ప్రపంచ కప్ ‘ప్రపంచ టెర్రర్ కప్’గా మారతుందంటూ సోషల్ మీడియాలో పన్నూ చేసిన హెచ్చరికలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ముందే రికార్డు చేసిన ఓ వాయిస్ మెసేజ్‌ను విదేశీ ఫోన్ నంబర్‌తో సోషల్ మీడియాలో పన్నూ పోస్టు చేశాడని తెలిపారు. +447418343648 అనే నంబర్‌తో దేశవ్యాప్తంగా చాలామందికి ఈ మెసేజ్ అందిందని పేర్కొన్నారు. మెసేజ్ అందుకున్నవారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. సబ్ఇన్స్పెక్టర్ హెచ్.ఎన్.ప్రజాపతి ఫిర్యాదు మేరకు పన్నూపై కేసు పెట్టినట్లు వివరించారు. +44 అనేది యునైటెడ్ కింగ్డమ్(యూకే) కోడ్ కావడం గమనార్హం. అయితే, ఇంటర్నెట్ కాల్ టెక్నాలజీతో ఇలా విదేశీ ఫోన్ నంబర్ల నుంచి సందేశం వస్తున్నట్లు తప్పుదోవ పట్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పన్నూ హెచ్చరికల మెసేజ్ ఎక్కడి నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ...ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ విదేశీ ఫోన్ నంబర్‌తో వచి్చన కాల్‌ను రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రి–రికార్డెడ్ వాయిస్ మెసేజ్ వినిపిస్తోందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు జీతూ యాదవ్ తెలియజేశారు. ‘‘అమర వీరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కచి్చతంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లు ఉపయోగిస్తాం. మీరు సాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం. అక్టోబర్ 5వ తేదీని గుర్తు పెట్టుకోండి. ఆ రోజు క్రికెట్ ప్రపంచ కప్ కాదు, ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభమవుతుంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో ఖలిస్తాన్ జెండాలతో అహ్మదాబాద్‌ను ముట్టడిస్తాం.. ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ’’ అంటూ ఆ సందేశంలో హెచ్చరికలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్ నగర ప్రజలకు గత రెండు రోజులుగా ఈ మెసేజ్ వస్తోందన్నారు. ఎవరీ పన్నూ? సిక్కుల కోసం భారత్‌లో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురుపట్వంత్ సింగ్ పన్నూ పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ సమీపంలోని ఖంజోత్ అనే గ్రామంలో జని్మంచాడు. న్యాయ విద్య అభ్యసించాడు. అనంతరం కెనడాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. కెనడా పౌరసత్వం కూడా సంపాదించాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను స్థాపించాడు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబీయింగ్ చేస్తున్నాడు. హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్యపై పన్నూ తీవ్రంగా రగిలిపోయాడు. కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశాడు. 2020 జూలైలో పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో అజ్ఞాతంలో ఉన్నాడు. -
హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం
-
హైదరాబాద్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
-
Israel- Palestine: క్షతగాత్రి పాలస్తీనా
ఒక సంక్లిష్ట సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం వెనకుండే ప్రధాన లక్ష్యం పరస్పరం తలపడే వైరి వర్గాల మధ్య సామరస్యాన్ని కుదర్చడం, శాంతి స్థాపన జరిగేలా చూడటం. కానీ ఆ పరిష్కారాన్ని వైరి వర్గాలు ఒక ఎత్తుగడగా మాత్రమే భావిస్తే, భవిష్యత్తులో బలాబలాల సమీకరణకు చిక్కిన వ్యవధిగా విశ్వసిస్తే... కనుగొన్న పరిష్కారం కాస్తా సమస్యను మించి జటిలంగా మారుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు నిరంతరాయంగా కురిపిస్తున్న నిప్పుల జడిలో ధ్వంసమవుతున్న పాలస్తీనాలో జరిగింది అదే. ఈ ఘటనల నేపథ్యాన్ని ఒకసారి చూడాలి. ఇజ్రాయెల్‌లో గత రెండేళ్లుగా నాలుగుసార్లు ఎన్నికలు నిర్వహించినా ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. పాలస్తీనాలో 2006 నుంచి పెండింగ్‌లో వున్న పార్లమెంటు ఎన్నికలు ఘర్షణలు మొదలైన వెంటనే వాయిదా పడ్డాయి. ఇప్పుడు వర్తమాన ఘర్షణల వెనకున్నదెవరో, ఏ ప్రయోజనం ఆశించి వీటిని సాగిస్తున్నారో సులభంగానే అంచనా వేయొచ్చు. మొత్తానికి ఇటు గాజా స్ట్రిప్ ను పర్యవేక్షిస్తున్న హమాస్‌కూ, అటు ఇజ్రాయెల్ దళాలకూ మధ్య సాగుతున్న సంకుల సమరంలో ఇంతవరకూ 83 మంది పాలస్తీనా పౌరులు కన్నుమూశారు. ఇందులో 17 మంది పిల్లలు, మరో ఏడుగురు మహిళలు. 480 మంది గాయ పడ్డారు. ఇజ్రాయెల్‌వైపు ఒక సైనికుడు, ఆరుగురు పౌరులు మరణించగా అందులో కేరళకు చెందిన ఒక నర్సు కూడా వున్నారు. ఆకాశాన్నంటే భవంతులు కుప్పకూలాయి. మీడియా సంస్థ లున్న భవనం సైతం ఇజ్రాయెల్ దాడిలో నాశనమైంది. హింస నివారించి, అన్ని పక్షాలూ శాంతి స్థాపనకు ప్రయత్నించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. కానీ ఎప్పటిలాగే ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారు. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఆ దేశానికున్నదంటూ సమర్థించారు. అరబ్–ఇజ్రాయెల్ ఘర్షణల్లో ఇది రివాజే. ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నట్టు హమాస్ మిలి టెంట్లు తొలి దాడికి దిగివుండొచ్చుగానీ... కానీ దానికి దారి తీసిన పరిణామాలేమిటి? ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో చరిత్రాత్మకమైన అల్–అక్సా మసీదులో ఎప్పటిలాగే ప్రార్థన లకు ఉపక్రమించిన వేలాదిమందిపై ఇజ్రాయెల్ పోలీసులు ఎందుకు దాడి చేశారు? ఇజ్రాయెల్‌కు ఆత్మ రక్షణ హక్కు వున్నట్టే పాలస్తీనా పౌరులకూ వుండాలి కదా! తటస్థంగా వుండదల్చుకుంటే వేరు. కానీ ఆ ముసుగులో ఒక పక్షానికే కొమ్ము కాయడం, దాని తీరు సరైందన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేయడం వంచన తప్ప మరేం కాదు. యాభై అయిదేళ్లక్రితం...అంటే 1967లో ఆరు రోజులపాటు జరిగిన అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంలో వర్తమాన విషాదానికి బీజాలున్నాయి. ఆ యుద్ధంలో తూర్పు జెరూసలేం ప్రాంతాన్ని జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు కైవసం చేసుకున్నాయి. జెరూసలేం తమ రాజధాని అంటూ ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించినా అంతర్జాతీయంగా దాన్నెవరూ గుర్తించలేదు. శాంతి ఒప్పందంలో భాగంగా తూర్పు జెరూసలేంలోని అల్–అక్సా మసీదు నిర్వహణ బాధ్యత జోర్డాన్ ఆధ్వర్యంలోని ఇస్లామిక్ ట్రస్టు అధీనంలో వుంది. కానీ ఆ కట్టడం వున్న 35 ఎకరాల ప్రాంతం ముస్లింలతోపాటు క్రైస్తవులకూ, యూదులకూ కూడా పవిత్రమైన ఆవరణ. యథాపూర్వ స్థితి ఏర్పడేలా చూసినప్పుడే ఏ శాంతి ఒప్పందమైనా నాలుగు కాలాలపాటు మనుగడ సాగిస్తుంది. కానీ జరిగింది అది కాదు. తూర్పు జెరూసలేంనుంచి ఇజ్రాయెల్‌ను పొమ్మనకుండా, అల్–అక్సా ఆవరణను మూడు మతాల వారూ సందర్శించడానికి వీలుకల్పిస్తూ రాజీ కుదిర్చారు. ఇదే సమస్యను మరింత జటిలం చేసింది. అక్కడ భిన్న మతాల తీవ్రవాద బృందాలమధ్య ఘర్షణలు జరగడం... వాటిని ఎప్పటికప్పుడు ఏదో రకంగా చల్లార్చడం రివాజైంది. అల్–అక్సా ప్రాంతంలో యూదు తీవ్రవాద బృందాల కదలికలు ఎక్కువయ్యాయని గత నెలలో జోర్డాన్ విదేశాంగమంత్రి ఫిర్యాదు చేశారు. ఇది రంజాన్ మాసమై నందువల్ల ఏ చిన్న ఘర్షణైనా పెనుముప్పుగా పరిణమించొచ్చని హెచ్చరించారు. ఈలోగా తమకూ ప్రార్థించే హక్కుందంటూ యూదు తీవ్రవాద బృందాలు పేచీ మొదలెట్టాయి. అంతక్రితమే పాత నగరంలో యూదు ఛాందస బృందాలకూ, పాలస్తీనా పౌరులకూ ఘర్షణలు రాజుకున్నాయి. ఆ సాకుతో ముస్లింలు అటు రావడానికి వీల్లేదంటూ ఇజ్రాయెల్ పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే ఇజ్రాయెల్ పౌరుల కోసం ఆవాసాల నిర్మాణం మొదలైంది. ఇవన్నీ ఎందుకు చోటుచేసు కున్నాయో సులభంగానే అంచనా వేయొచ్చు. అధికారాన్ని అంటిపెట్టుకుని వుండాలన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆశలపై గత రెండేళ్లలో ఒకసారి కాదు... నాలుగుసార్లు ఆ దేశ ప్రజలు నీళ్లు చల్లారు. మళ్లీ పాలస్తీనా పోరు రాజేసి గట్టెక్కాలని ఆయన ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ విపక్షాలన్నీ నెతన్యాహూ లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వర్తమాన ఘర్షణ నెతన్యాహూ కోరుకుంటున్నట్టు ఆయన స్థితిని మెరుగుపరుస్తుందో లేదో చూడాలి. అయితే ఈ దారుణ మారణ హోమంలో పాలస్తీనా పౌరులు సమిధలవుతున్నారు. దీన్నంతటినీ నిర్వికారంగా చూస్తూ వుండిపోవడం మానవీయతకే అపచారమని ప్రపంచ పౌరులు గుర్తిస్తే తప్ప ఇందుకు శాశ్వత పరిష్కారం దొరకదు. దురాక్రమణదారుగా, మారణహోమ సృష్టికర్తగా, అకారణ పేచీలతో నిత్యం పాలస్తీనా పౌరులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఇజ్రాయెల్ 1967కు ముందునాటి భూభాగానికి ఉపసంహరించుకోవడం ఒక్కటే వారి శాశ్వత భద్రతకు గ్యారంటీ ఇవ్వగలదు. చదవండి: వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, హమాస్ I watched this video 6 times with tears flooded in my eyes. They’re destroying the main towers in the most vital area in #Gaza city. Now a lot of people left without homes, offices, even without the good memories they had there. pic.twitter.com/WBIZn19Q5H — Abier-Almasri (@abier_i) May 12, 2021 -
ఏజెన్సీలో ఉగ్రమూలాలు!
మణుగూరు : మావోయిస్టు æప్రభావిత ప్రాంతంగా పేరున్న మణుగూరు సబ్ డివిజన్లో గత సంవత్సర కాలంలో ఉగ్రవాద మూలాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఈ ప్రాంత వాసులకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర పోలీసులు గుర్తించడం గమనార్హం. ఈనెల 12న రాత్రి జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గుగూ తమ సంస్థకు చెందిన వారేనని అన్సార్ గజ్వతుల్ హింద్(ఏజీòహెచ్) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, ఈ ముగ్గురిలో ఒకరు అశ్వాపురానికి చెందిన యువకుడు మహ్మద్ తౌఫిక్(27) కావడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ వార్త మణుగూరు సబ్‌డివిజన్‌లో సంచలనం రేకెత్తించింది. తౌఫిక్ అశ్వాపురంలోని భారజల కర్మాగార ఉద్యోగి రజాక్ చిన్న కుమారుడిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో యువత ఉగ్రవాద భావాలపై మొగ్గు చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. సబ్‌డివిజన్‌లో పెరుగుతున్న ఉగ్రభావాలు మణుగూరు సబ్ డివిజన్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, పరిచయాలు ఎక్కువగా కలిగిన వ్యక్తులు క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. 5 నెలల క్రితం మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న సోమేశ్వరరావు అనే మత ప్రవక్తను హైదరాబాద్ పోలీసులు రామానుజవరం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తీవ్రవాదిగా మారిన యువకుడు... మహ్మద్ తౌఫిక్ హెవీ వాటర్‌ప్లాంట్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. డిప్లొమా చదివేందుకు వనపర్తి వెళ్లి.. మధ్యలోనే చదువు మానేసి వచ్చాడు. ఆ తర్వాత అశ్వాపురంలోనే ఉంటూ దొంగతనాలు చేస్తూ 2009లో పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత కాలనీలో ఆకతాయిలతో కలిసి పలు అల్లర్లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. 2016 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే చదువుకుంటున్నట్లు తల్లిదండ్రులను నమ్మించాడు. ఈ క్రమంలో తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పడ్డాయి. కాగా, తౌఫిక్ అన్సార్ గజ్వతుల్ హింద్ అనే తీవ్రవాద సంస్థలో కీలకంగా పనిచేశాడని ఎన్కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చింది. తన కొడుకు సమాజంలో పరువుపోయే పని చేశాడని, వాడి శవం కూడా తనకు వద్దని మృతుని తండ్రి రజాక్ ‘సాక్షి’కి తెలిపారు. మణుగూరు సబ్‌డివిజన్‌పై పెరిగిన నిఘా తీవ్రవాద భావాలు గల వ్యక్తులు మణుగూరు సబ్ డివిజన్లో పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడి తీవ్రవాద మూలాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మహ్మద్ తౌఫిక్ కదలికలపై ముందుగానే సమాచారం తెలుసుకొని అతనిపై నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అతడి ఆచూకీ కోసం 3 నెలల క్రితం కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్‌లో, సెక్యూరిటీలో, అశ్వాపురం పట్టణలో పలు వివరాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. తౌఫిక్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు, స్నేహితులు, అతనితో కలిసి సోషల్ మీడియాలో భావాలు పంచుకున్న వ్యక్తులపై కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు, రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు. ఇలా చేస్తాడని ఊహించలేదు : మహ్మద్ రజాక్, తౌఫిక్ తండ్రి తౌఫీక్ మృతిపై అతడి తండ్రి రజాక్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా తన కుమారుడు ఇలా చేస్తాడని అనుకోలేదని అన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు జాబ్ చేస్తున్నానని చెప్పాడని, వ్యాపారం చేస్తానంటూ ఆరు నెలల క్రితం రూ.30,000 తీసుకెళ్లాడని తెలిపారు. తన కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. అతడి మృతదేహానికి తనకు ఏ సంబంధం లేదని చెప్పారు. -
సౌదీలో 47 మందికి ఉరిశిక్ష అమలు
రియాద్: ప్రముఖ మత గురువు షేక్ నిమిర్ ఆల్ నిమిర్ సహా 47 మందికి శనివారం మరణదండన అమలు చేసినట్లు సౌదీ అరేబియా హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందనే వారికి శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తూ 2003-2006 మధ్యకాలంలో ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులకు ఈ శిక్ష అమలు చేశామని ప్రభుత్వం పేర్కొంది. 2015 ఏడాదిలో 158 మందికి పైగా మరణశిక్ష అమలు చేశామని ఓ అధికారి స్థానిక మీడియాతో చెప్పారు. అందులో కేవలం నవంబర్ లోనే 45 మంది విదేశీయులు సహా 63 మందికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరాకు సంబంధించి మరణశిక్ష పడింది. గతంలో 1995లో అత్యధికంగా 192 మందికి ఉరిశిక్ష అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.