IPL 2022: కొత్త సీజన్‌.. కొత్త జెర్సీ మావాస్‌!! | IPL 2022 Sunrisers Hyderabad To Unveil New Jersey Kotha Season Kotha Jersey Mawas | Sakshi
Sakshi News home page

IPL 2022- SRH: కొత్త సీజన్‌.. కొత్త జెర్సీ మావాస్‌!!

Published Wed, Feb 9 2022 12:27 PM | Last Updated on Wed, Feb 9 2022 2:02 PM

IPL 2022 Sunrisers Hyderabad To Unveil New Jersey Kotha Season Kotha Jersey Mawas - Sakshi

కొత్త సీజన్‌.. కొత్త జెర్సీ మావాస్‌ అంటున్న సన్‌రైజర్స్‌(PC: SRH)

IPL 2022- SunRisers Hyderabad: ఐపీఎల్‌-2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రకటన వెలువడనుంది. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లకు గానూ కేవలం మూడింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటుకల్పించకపోవడంతో విమర్శలు ఎదుర్కొంది. 

ఈ క్రమంలో వరుస ఓటములతో ఆరెంజ్‌ ఆర్మీ నిరాశలో కూరుకుపోయింది. ఇక రిటెన్షన్‌లో భాగంగా వార్నర్‌తో పాటు మరో స్టార్‌ ప్లేయర్‌ రషీద్‌ ఖాన్‌ను కూడా సన్‌రైజర్స్‌ వదిలేసింది. కేన్‌ విలియమ్సన్‌ (రూ. 14 కోట్లు), అబ్దుల్‌ సమద్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు), ఉమ్రాన్‌ మలిక్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. ఇక గత సీజన్‌లో చేదు అనుభవం నేపథ్యంలో ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగనుంది. ఇప్పటికే వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారాను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకున్న హైదరాబాద్‌...  సైమన్‌ కటిచ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంచుకుంది. 

ఎస్‌ఆర్‌హెచ్‌ సిబ్బంది:
హెడ్‌కోచ్‌- టామ్‌ మూడీ
అసిస్టెంట్‌ కోచ్‌- సైమన్‌ కటిచ్‌
బ్యాటింగ్‌ కోచ్‌- బ్రియన్‌ లారా
ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌- డేల్‌ స్టెయిన్‌
స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌- ముత్తయ్య మురళీధరన్‌
ఫీల్డింగ్‌ కోచ్‌, స్కౌట్‌- హేమంగ్‌ బదాని

చదవండి: IPL 2022 Mega Auction: అప్పుడు 1.5 కోట్లు.. ఇప్పుడు అత‌డి కోసం యుద్దం జ‌ర‌గ‌నుంది.. రికార్డులు బ‌ద్ద‌లు అవ్వాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement