టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్
Sunil Gavaskar Comments: శ్రీనగర్ సంచలనం, సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన తీరుతో ఆకట్టుకుంటున్నాడని ఈ స్పీడ్‌స్టర్‌ను కొనియాడారు. టీమిండియాలో చోటు దక్కించుకునే ప్రదర్శనతో దూసుకుపోతున్నాడని ప్రశంసించారు. ఇంగ్లండ్‌తో సిరీస్ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్‌ను భారత జట్టుకు ఎంపిక చేయాలని టీమిండియా సెలక్టర్లకు సూచించాడు.
కాగా గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్‌బౌలర్‌గా చేరిన ఉమ్రాన్ మాలిక్ తుదిజట్టులో చోటు దక్కించుకుని తన వేగవంతమైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఇక ఐపీఎల్-2022 సీజన్‌లో 13 మ్యాచ్‌లలో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో వేగంగా బంతిని విసరడంలో దిట్ట అయిన ఉమ్రాన్ మాలిక్‌ను టీమిండియాకు సెలక్ట్ చేయాలని క్రీడా విశ్లేషకుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఉమ్రాన్ మాలిక్(PC: IPL/BCCI)
ఈ క్రమంలో సునిల్ గావస్కర్ ఉమ్రాన్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఉమ్రాన్ మాలిక్ బంతిని విసరడంలో తన వేగం, కచ్చితత్వంతో కట్టిపడేస్తున్నాడు. తనలో నాకు నచ్చిన లక్షణాలు ఈ రెండే. తను అత్యద్భుతమైన బౌలర్. వికెట్ టు వికెట్ బౌల్ చేశాడంటే ఇక అంతే సంగతులు. త్వరలోనే అతడు టీమిండియాకు ఆడతాడు. ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్టు, వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేయండి’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా గతేడాది అర్ధంతరంగా ఆగిపోయిన ఒక టెస్టు, 3 మ్యాచ్‌ల వన్డే, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు చేరుకోనుంది. ఇక ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో మరోసారి విఫలమైన సన్‌రైజర్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం(మే 22) తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిస్తే హైదరాబాద్ విజయాల సంఖ్య ఏడుకు చేరుతుంది.
చదవండి👉🏾IPL 2022 Playoffs: ఢిల్లీని చిత్తు చేసిన ముంబై.. ఎగిరి గంతేసిన కోహ్లి.. ఆర్సీబీ ఆటగాళ్ల వీడియో వైరల్
చదవండి👉🏾Rishabh Pant: ఓటమికి పంత్‌ను నిందించాల్సిన అవసరం లేదు.. మా కొంప ముంచింది అదే: పాంటింగ్
Silken arm extensions. Just @IamAbhiSharma4 being his classy best at the nets. 🔥🧡#SRHvPBKS #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/KB7vrRhqxw
— SunRisers Hyderabad (@SunRisers) May 22, 2022
Comments
Please login to add a commentAdd a comment