Telangana Minister KTR Praises SRH Pacer Umran Malik - Sakshi
Sakshi News home page

PBKS VS SRH: ఉమ్రాన్‌ మాలిక్‌ను ఆకాశానికెత్తిన కేటీఆర్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్‌ అంటూ..!

Published Mon, Apr 18 2022 3:24 PM | Last Updated on Tue, Apr 19 2022 11:25 AM

Telangana Minister KTR Praises Umran Malik - Sakshi

IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 17) జరిగిన మ్యాచ్‌లో ఉగ్రరూపం (4/28) ప్రదర్శించిన సన్‌రైజర్స్‌ హైదరాబద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ట్విటర్‌ వేదికగా కశ్మీరి యంగ్‌ గన్‌ను ఆకాశానికెత్తాడు. భీకరమైన పేస్‌తో కూడిన నమ్మశక్యం కాని స్పెల్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్‌.. టేక్‌ ఎ బౌ యంగ్‌ మ్యాన్‌ అంటూ అభినందనలతో ముంచెత్తాడు. ఇందుకు ఉమ్రాన్‌ ఆఖరి ఓవర్‌ గణాంకాలకు సంబంధించిన ఫోటోను జోడించి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ ట్వీట్‌ వైరలవుతోంది. మంత్రి కేటీఆర్‌ ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా క్రికెట్‌ను తప్పక ఫాలో అవుతాడన్న విషయం తెలిసిందే. 


కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ (పంజాబ్‌ ఇన్నింగ్స్‌) వేసిన ఉమ్రాన్‌ ఒక్క పరుగుల కూడా ఇ‍వ్వకుండా 3 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఆర్షదీప్‌ రనౌట్‌ కావడంతో ఆ ఓవర్‌లో మొత్తం 4 వికెట్లు పడ్డాయి. ఉమ్రాన్‌ వేసిన ఈ సంచలన స్పెల్‌పై కేటీఆర్‌తో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ కశ్మీరీ యంగ్‌ గన్‌ టీమిండియా స్టార్‌ బౌలర్‌గా  రాణిస్తాడని కొనియాడుతుంది. ఇదిలా ఉంటే, పంజాబ్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్‌ ఉగ్రరూపంతో పాటు బ్యాటర్లు తలో చెయ్యి వేయడంతో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసిన ఆరెంజ్‌ ఆర్మీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. 
చదవండి: "అత‌డు అద్భుత‌మైన బౌల‌ర్‌.. త్వ‌ర‌లోనే భార‌త‌ జ‌ట్టులోకి వ‌స్తాడు"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement