Photo Courtesy: IPL
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో 20 అంత కంటే ఎక్కువ వికెట్లు తీసిన అతి పిన్న భారతీయ బౌలర్ (22 ఏళ్ల 176 రోజులు)గా రికార్డు సృష్టించాడు.
ఉమ్రాన్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేసర్ బుమ్రా పేరిట ఉండేది. 2017 ఐపీఎల్ సీజన్‌లో బుమ్రా 23 ఏళ్ల 165 రోజుల వయసులో 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టగా.. ప్రస్తుత సీజన్‌లో ఉమ్రాన్.. 13 మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు నేలకూల్చాడు. వీరిద్దరికి ముందు ఆర్పీ సింగ్ (23 ఏళ్ల 166 రోజులు) 2009లో, ప్రజ్ఞాన్ ఓజా (23 ఏళ్ల 222 రోజులు) 2010 సీజన్లలో ఈ ఘనత సాధించారు.
ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(76) అర్ధశతకంతో రాణించగా.. ప్రియమ్ గార్గ్(42), నికోలస్ పూరన్(38) పర్వాలేదనిపించారు. అనంతరం ఛేదనలో ముంబై చివరి నిమిషం వరకు పోరాడి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో (190/7) నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.
చదవండి: IPL 2022: అదరహో హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం
Comments
Please login to add a commentAdd a comment