Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదివారం(మే1) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ ఏకంగా గంటకు కు 154 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన తొలి బౌలర్‌గా మాలిక్ రికార్డు సృష్టించాడు.
గుజరాత్ టైటాన్స్ పేసర్ ఫెర్గూసన్(153.కి.మీ వేగం) పేరిట ఉన్న రికార్డును మాలిక్ బద్దలు కొట్టాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు టాప్ 5 ఫాస్టెస్ట్ డెలివరీల్లో నాలుగు ఉమ్రాన్ పేరిటే ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్.. 7 మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులను గెలుచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
చదవండి: IPL 2022: ధోని ఈజ్ బ్యాక్... ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్‌కే విజయం
@umran_malik_1 #154 #kmph to @msdhoni pic.twitter.com/pbZArf2Mok
— Munna (@MUNNA_BHAI98) May 1, 2022
Comments
Please login to add a commentAdd a comment